అక్కినేని ప్యామిలితో స‌మంత‌కు ఉన్న ప‌రిచ‌యం, అనుబంధం ఎంతో విలువైన‌ది. స‌మంత‌ను టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో నిల‌బెట్టిన మూవీ ఏమాయ‌చేశావే. ఏ మాయ చేశావే మూవీలో అక్కినేని మూడో త‌రం న‌ట వార‌సుడైన నాగ‌చైత‌న్య స‌ర‌స‌న న‌టించి టాలీవుడ్‌లో ఇండ‌స్ట్రీలో సూప‌ర్ స‌క్సెస్‌ను అందుకుంది. ఆనాటి నుండి అక్కినేని ఫ్యామిలీతో స‌మంత‌కు అనుబందం పెరుగుతూనే వ‌స్తుంది త‌ప్పితే, ఏనాడు ఆగిపోలేదు. త‌రువాత అదే నాగ‌చైత‌న్యతో ఆటోన‌ర్‌సూర్య మూవీలో న‌టించింది. అంత‌టితో ఆగిపోకుండా అక్కినేని వంశ వృక్షం అయిన అక్కినేని నాగేశ్వర‌రావుతో మ‌నం మూవీలో న‌టించి అక్కినేని ఫ్యామిలికు మ‌రింత చేరువయ్యింది. అయితే ఇప్పుడు అక్కినేని నాగేశ్వర‌రావు న‌టించిన క‌ళా అద్భుత‌మైన మూవీ దేవ‌దాసు రిమేక్‌లోనూ న‌టించేందుకు సిద్ధం అంటుంది. స‌మంత చెబుతున్న ఈ విష‌యాల‌ను ఎపిహెరాల్డ్‌.కం మీ ముందుకు తీసుకువ‌స్తుంది. ఈ దేవాదాసు రిమేక్‌లో మ‌న‌వ‌డు సుమంత్ హీరోగా న‌టిస్తున్నాడు. రీసెంట్‌గా 'దేవ‌దాసు మూవీను ఈనాటి ప‌రిస్థితుల‌కు త‌గ్గట్టుగా రిమేక్ చేయాల‌ని ఉంది' అంటూ ఓ ప్రక‌ట‌న కూడ ఇచ్చాడు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోని చెర‌గ‌ని మూవీ దేవ‌దాసు కావ‌డంతో, ఆ మూవీ అక్కినేని ప్యామిలి హీరోల‌ది కావ‌డం వంటి విష‌యాలు స‌మంత‌కు దేవ‌దాసు రిమేక్‌లో న‌టించేందుకు ఆస‌క్తిని పెంచింద‌ట‌. ఈ విష‌యంపై అఫిషియ‌ల్‌గా స్టేట్‌మెంట్‌ను త్వర‌లోనే ఇవ్వనుంద‌ని టాలీవుడ్ వ‌ర్గాల నుండి అందిన స‌మాచారం. దేవ‌దాసు రిమేక్‌లో అక్కినేని ప్యామిలి హీరోల‌లో ఎవ‌రు చేస్తే బాగుంటుంది? అందులో హీరోయిన్ స‌మంత చేస్తు బాగుంటుందా? వ‌ంటి విష‌యాల‌కు మీ అభిప్రాయాల‌ను ఇక్కడ తెల‌ప‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: