టాలీవుడ్ ఇండ‌స్ట్రీను ఎడం కాలుతో త‌న్నినంత‌ ప‌ని చేసింది ఇలియాన‌. టాలీవుడ్‌, కోలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌ను కైవ‌సం చేసుకున్న ఇలియాన‌ను, ఒక్కసారిగా ప‌క్కన పెట్టేశారు. ఇలియాన కొటి రూపాయ‌లు డిమాండ్ చేస్తుంది, అందుకే ప‌క్కన పెట్టేశాము అని టాలీవుడ్ చెబుతున్నా అస‌లు కార‌ణం వేరే ఉంద‌ని అంటున్నారు. అదేంటంటే ఇలియాన‌ను చాలా మంది హీరోలు వారి మూవీల‌కు బుక్ చేసుకున్నారు. అయితే అంద‌రు హీరోలు ఇంకో హీరోయిన్‌ను తీసుకువ‌చ్చి, ష‌డ‌న్‌గా ఇలియాన‌ను మూవీల నుండి త‌ప్పించారు. ఇలా ఒక్క హీరో చేస్తే పాపం ఇలియాన బాధ‌ప‌డేది కాదు. దాదాపు అయిదుగురు టాప్ హీరోలు వ‌రుస‌పెట్టి ఇలా చేయ‌డంతో ఇలియాకు ఒళ్ళు మండి బాలీవుడ్‌కు చెక్కేసింది. ఆ త‌రువాత కొంత మంది ఇలియాన‌ను వారి మూవీల‌లో తీసుకుందామ‌ని ఫుల్ క్యాష్‌తో వెళ్ళినా, అవ‌స‌రం లేదంటూ తిరిగి పంపించేసింది. అయితే బాలీవుడ్‌లో మొద‌ట క‌ష్టాల‌ను చూసిన ఇలియానకు ఇప్పుడు టైం బాగుంద‌ని అంటున్నారు. బి టౌన్‌లో ఇలియాన్ అప్‌క‌మింగ్ ఫిల్మ్ 'మే తేరా హీరో' మూవీ థియోట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో ఇలియాన లుక్స్ అధుర్స్ అని బాలీవుడ్ అంటున్నారు. నిజానికి రిలీజ్ అయిన ట్రైల‌ర్‌లో ఇలియాన చాలా క్యాజువ‌ల్‌గా క‌నిపించినా, అంద‌దూ సూప‌ర్ అంటూ కామెంట్ ఇస్తున్నారు. ఇలా ఎందుకు అంటున్నారో అని సీక్రెట్ తెలుసుకున్నవారు, తెర‌వెన‌క ఇలియాన మూవీ నిర్మాత‌ల‌కు ఎంతగానో స‌హ‌క‌రించింది అనే నిజాలను తెలుసుకుంటున్నారంట‌. అంద‌కే ఇలియాన సూప‌ర్ అంటున్నారు. మొత్తానికి బిటౌన్ స‌క్సెస్ ఫార్ములాను ఇలియాన క‌నిపెట్టేసిన‌ట్టే అని టాక్స్ వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: