తెలుగు తెర జేజమ్మ యోగా బ్యూటి అనుష్క ముగాజీవాలపై కొత్త సిద్దాంతాన్ని ప్రతిపాదిస్తోంది. ‘ప్రేమిస్తేనే పెంచుకోండి, ప్రేమించే మనసు లేకుంటే తీసుకెళ్లొద్దు. ఏదో స్టేటస్ సింబల్‌గానో, డాబు దర్బంగా మాత్రం పెంపుడు జంతువులను పెంచుకోవద్దు, పెంపుడు జంతువులను ప్రేమించలేనప్పుడు వాటిని తీసుకుని వెళ్లకూడదు' అని నటి అనుష్క ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.  పెడిగ్రీ సంస్థతో కలిసి బ్లూక్రాస్ ఆఫ్ హైదరాబాద్ నిర్వహిస్తున్న మొట్టమొదటి పెట్ కార్నివాల్ గురించిన విశేషాలను తెలియజేయటానికి ఏర్పాటుచేసిన సమావేశానికి అనుష్క ముఖ్య అతిథిగా హాజరయింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఉండేయాంత్రికమైన ఉరుకుల పరుగుల జీవితంలో పెంపుడు జంతువుల వల్ల మాత్రమే మానసిక ప్రశాంతత కలిలుగుతుందని ఆమె అన్నది.  రేపు రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ శిల్పారామం సమీపంలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ పెట్ కార్నివాల్ నిర్వహించబోతున్నారు. నగర బిజీ జీవితంలో కాస్త మానసిక ప్రశాంతత కలిగించేటటువంటివి పెంపుడు జంతువులే అని చెప్పిన అనుష్కతన నిజ జీవితంలో ఎన్ని మూగ జీవాలతో కాలక్షేపం చేస్తోందో మాత్రం మన యోగ సుందరి చెప్పలేదు.  ఈ పెట్స్ కార్నివాల్‌లో పెట్స్‌కు సంబంధించిన సందేహాలన్నీ తీరుస్తారట. మ్యాజిక్ షోలు, డాగ్ ర్యాంప్ వాక్స్.. ఇలా ఎన్నో విశేషాలున్నాయని అంటున్నారు. ఒక రోజు పాటు జరిగే ఈ కార్నివాల్‌లో నగరవాసులకు పూర్తి వినోదం అందిస్తుంది అని నిర్వాహకులు చెపుతున్నారు. పెరిగిపోతున్న ధరలు తరిగిపోతున్న ఆదాయాల మధ్య అనుష్క మాటలను ఎంత మంది గౌరవించి ఆచరిస్తారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: