విక్టరీ వెంకటేష్ కృష్ణవంశీ దర్శకత్వంలో చరణ్ తో కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా చేస్తాడు అంటూ అధికారక ప్రకటన వచ్చిన తరువాత ఆ సినిమా కధలో వచ్చిన మార్పులుచేర్పులు వల్ల వెంకీ ఆ ప్రాజెక్టు నుండి తప్పుకుని శ్రీకాంత్ చరణ్ పక్కన చేరాడు అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే అసలు వెంకటేష్ ఈ సినిమా నుంచి ఎందుకు బయటకు వచ్చాడో తెలియకపోయినా రకరకాల ఉహాగానాలు మాత్రం ఈ సినిమా విషయం పై వచ్చాయి.  ఈ ప్రాజెక్టు నుండి బయటకు వచ్చిన వెంకటేష్ మారుతీ తీయబోయే ‘రాధా’ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కావడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఈ సినిమాను కూడా చరణ్ నటిస్తున్న కృష్ణవంశీ మల్టీ స్టారర్ ప్రారంభం అవుతున్న ఫిబ్రవరి 6వ తారీఖునాడే ప్రారంభం కావడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారడమే కాకుండా వెంకటేష్ చరణ్ సినిమాతో పోటీ పడుతున్నాడు అనే వార్తల వరకు వెళ్ళిపోయింది.  వెంకటేష్ హోమ్ మినిస్టర్ గా నటిస్తున్న ‘రాధ’ సినిమా ఒక మధ్య తరగతి అమ్మాయి జీవితం చుట్టూ తిరిగితే రామ్ చరణ్ శ్రీకాంత్ తో కలిసి నటిస్తున్న కృష్ణవంశీ సినిమా కూడా మధ్య తరగతి కుటుంబ నేపధ్యంలోనే సినిమా కధ నడుస్తుంది. ఈ విధంగా ఒకే రోజు ఒకే మధ్య తరగతి కుటుంబాలకు చెందిన రెండు పెద్ద సినిమాలు ప్రారంభం కావడం బట్టీ చెర్రీ తో వెంకటేష్ పోటీ పడటమే కాకుండా ఈ సినిమాలు యించు మించు ఒకేసారి విడుదల అయి చరణ్, వెంకీల పోటీకి రంగం సిద్దం అవుతుందా అంటూ సెటైర్లు పడుతున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: