పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ గా టాలీవుడ్ ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేశాడు. ఈ సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టడంతో గబ్బర్ సింగ్ సీక్వెల్ కూడా చేద్దామని డిసైడ్ అయ్యారు. ఐతే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మరో గబ్బర్ సింగ్ రాబోతున్నాడు. మాస్ మహారాజ్ గా పేరు తెచ్చుకున్న రవితేజ పోలీస్ గెటప్ లో దుమ్మురేపేందుకు రెడీ అయ్యాడు. బలుపు సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రవితేజ ఇప్పుడు పవర్ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. రీసెంట్ గా పవర్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. పోలీస్ గెటప్ లో ఉన్న రవితేజ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ పై దర్జాగా గన్ను పట్టుకుని కూర్చున్నాడు. రవితేజ స్టైల్ చూసిన వారందరికీ గబ్బర్ సింగ్ లో పవన్ కల్యాణ్ గుర్తొస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మాస్ మారాజ్ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించనున్నాడు. కామన్ గా రవితేజ యాక్టింగ్ అనగానే కామెడీ పర్సంటేజి బీభత్సంగా ఉంటుందని ఆడియన్స్ ఊహించుకుంటారు. అందరి అంచనాలకు తగినట్టుగానే రవితేజ కామెడీ పండించడం గ్యారెంటీ అని ఏపీ హెరాల్డ్ భావిస్తోంది. ఐతే గబ్బర్ సింగ్ లో కూడా పవన్ కల్యాణ్ కామెడీని ఇరగదీశాడు. అంతకంటే కొత్తగా రవితేజ ఏమైనా చేయగలుగుతాడా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. గబ్బర్ సింగ్ సీక్వెల్ రాకముందే టాలీవుడ్ ప్రేక్షకులు మరో గబ్బర్ సింగ్ ను చూడబోతున్నారన్నమాట... పవర్ స్టార్ రేంజ్ లో రవితేజ కూడా సూపర్ హిట్ కొడతాడా..? లేక సాదాసీదాగా మిగిలి మరో ఫ్లాప్ ను మూటగట్టుకుంటాడా...?

మరింత సమాచారం తెలుసుకోండి: