సంవత్సరం పాటు ఒక సినిమా కూడా రిలీజ్ కి నోచుకోని నాని సినిమాలు ఇప్పుడు ఫిబ్రవరి లో ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. అంతేకాదు ఎప్పట్నుండో ల్యాబ్ లోనే మగ్గిపోతున్న పైసా సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవ్వబోతుందట. ఎపిహెరాల్డ్.కామ్ కి అందిన సమాచారం ప్రకారం సినిమాలన్ని వరుసన రిలీజ్ అవుతున్నాయి ఇక ఇంకా లేట్ చేస్తే ‘పైసా’ ఇక ఎప్పటికీ రిలీజ్ చేయడం కుదరదని ఊహించిన ప్రొడ్యూసర్ రమేష్ పుప్పాల ఈ సినిమాను ఫిబ్రవరి 7న రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడట. ఎన్నో రోజులుగా రిలీజ్ కి నోచుకోని నాని పైసా సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది. క్రియేటివ్ డైరక్టర్ కృష్ణ వంశీ డైరక్షన్ లో వస్తున్న ఈ మూవీలో నాని డిఫరెంట్ గా కనిపించనున్నాడట. ఇద్దరమ్మాయిలతో సినిమాలో ఆడియెన్స్ ని అలరించిన కేథరిన్ థెరిసా పైసాలో నానితో రొమాన్స్ చేసింది. రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ఈ సినిమా లాస్ట్ ఇయర్ నుండి పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. చివరకు అన్ని కార్యక్రమాలు ముగించుకుని ఎట్టకేలకు ఫిబ్రవరి 7 న రిలీజ్ కు రెడీ అయ్యింది. మనీ లాండరింగ్ సంబందించిన విషయాల మీద ఈ సినిమా స్టోరీ నడుస్తుందట. అంతేకాకుడా హీరో,హీరోయిన్ వేరు వేరు రెలిజియన్స్ కి సంబందించిన వారి ప్రేమను ఎలా గెలిచారు.. దానికి హీరోకి డబ్బు గురించి ఎన్ని కష్టాలొచ్చాయ్ అన్నది ఈ సినిమా కాన్సెప్ట్ అట. ఇప్పటికే నాని సినిమాలు జెండాపై కపిరాజు.. ఆహా కళ్యాణం సినిమాలు రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేశారు. ఇప్పుడు పైసా కూడా రిలీజ్ అవుతుంది. సో మొత్తానికి ఇన్నాళ్లు ఆగిన నాని ఈ మూడు సినిమాల రిజల్ట్ తో సూపర్ ఫాం లో కి వస్తాడనడంలో సందేహం లేదనిపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ నాని. పైసా ఫిబ్రవరి 7న వస్తుందంటారా..? నాని పైసా హిట్ అవుతుందా..?  

మరింత సమాచారం తెలుసుకోండి: