రెండున్నర సంవ‌త్సరాల వ‌స్తున్న ప్రిన్స్ మ‌హేష్‌బాబు, శ్రీనువైట్ల కాంబినేష‌న్ మూవీ ఆగడు. దూకుడు సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీపై టాలీవుడ్‌లో విప‌రీత‌మైన అంచ‌నాలు ఉన్నాయి. అంతే కాకుండా ఫ్యాన్స్‌లోనూ ఆగ‌డు మూవీపై భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు. అయితే దూకుడు మూవీతో పోల్చుకుంటే ఆగ‌డు మూవీ పూర్తి డిఫ్రెంట్ అని శ్రీనువైట్ల చెబుతున్నాడు. దూకుడు మూవీను మించి 10 రెట్లు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఆగ‌డు మూవీలో ఉంటుంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఆగుడు మూవీకు సంబంధించిన ప్రత్యేక‌మైన న్యూస్‌ను ఎపిహెరాల్డ్‌.కామ్ మీకు అందిస్తుంది. ఈ మూవీలో ప్రకాష్‌రాజ్, మ‌హేష్‌బాబుకి అపోజిట్ రోల్ చేస్తున్నాడు. అయితే ఇప్పటికే ఆగుడు మూవీలో మ‌హేష్‌బాబు డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నాడ‌నే వార్తలు వినిపిస్తున్నప్పటికి అందులో క్లారిటి లేద‌ని చిత్రయూనిట్ చెప్పింది. కాని ఆగుడు మూవీలో అస‌లైన డ్యూయ‌ల్ రోల్‌ చేస్తుంది ప్రకాష్‌రాజ్ అని తేలింది. చిత్ర‌యూనిట్ నుండి ఈ స‌మాచారం అందింది. ప్రకాష్‌రాజ్ విల‌న్ పాత్రలో చేస్తుండ‌గా, అందులోనూ డ్యూయ‌ల్ రోల్ కావ‌డంతో ఈ పాత్రలు ఎలా ఉండ‌బోతున్నాయ‌న్నదానిపై టాలీవుడ్‌లో టాపిక్స్ న‌డుస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీకు సంబంధించిన షూటింగ్‌ను త్వర‌గా పూర్తిచేయాల‌ని చిత్రయూనిట్ భావిస్తుంది. ఫిబ్ర‌వరి నెల చివ‌రికి ఆగ‌డు మూవీ షూటింగ్‌ను పూర్తిచేసే ప్లానింగ్‌లో ఉన్నాడు ద‌ర్శకుడు శ్రీనువైట్ల‌.

మరింత సమాచారం తెలుసుకోండి: