మోడలింగ్‌లో నంబర్ వన్ స్థానాన్ని కైవ‌సం చేసుకున్న ఐశ్వర్యారాయ్‌ని వెండితెరపైకి తీసుకొచ్చింది మణిరత్నమే. 1997లో ఆయన తమిళంలో తీసిన ‘ఇరువర్’ తో ఐశ్వర్య వెండితెరంగేట్రం చేశారు. ఈ మూవీ తెలుగులో ‘ఇద్దరు’గా అనువాదమైంది. ఆ సినిమా పరాజయం పాలయినా కూడా, గ్లామర్‌డాల్‌లా కనిపించే ఐశ్వర్యలో మంచి ఆర్టిస్టు ఉందనే విషయాన్ని ప్రపంచానికి తెలిసింది. అందుకే మణిరత్నం అంటే ఐశ్వర్యకు ప్రత్యేకమైన అభిమానం. ఆ తర్వాత ఐశ్వర్య బాలీవుడ్‌లో ఎంత బిజీ అయినా కూడా, మణిరత్నం ‘గురు’, ‘విలన్’ చిత్రాల‌ను చేసింది. కూతురు పుట్టాక సినీ ప్రపంచానికి దూరంగా జరిగిన ఆమె, త్వరలో సెకండ్ ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుట్టబోతున్నారట. తన గురువైన మణిరత్నం సినిమానే అందుకు సరైన శ్రీకారమని ఆమె భావించింది. మణిరత్నం ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో ఓ భారీ మల్టీస్టారర్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మహేష్‌బాబు హీరోగా రూపొందనున్న ఈ చిత్రం జూలైలో చిత్రీకరణకు వెళ్లనుంది. ఇందులో నాగార్జున కూడా నటిస్తున్నాడు. తమిళ, మలయాళ భాషలకు చెందిన కొందరు ప్రముఖ తారలు కూడా ఇందులో నటించబోతున్నారు. ప్రస్తుతం తారాగణం ఎంపికలో బిజీగా ఉన్న మణిరత్నం, ఐశ్వర్యారాయ్‌ని కూడా సంప్రదించారట. అయితే ఈ వార్తల‌పై స్పంధించిన ఐశ్వర్య రాయ్ అ వివ‌రాల‌ను త్వర‌లోనే వెల్లడిస్తాను అంటూ ఓ ప్రవేట్ ఫంక్షన్‌కు అటెండ్ అయిన సంద‌ర్భంలో మీడియాకు వివ‌రించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: