అమీర్ ఖాన్ నటించిన 3 ఇడియట్స్ సినిమా డిశెంబర్ 23, 2009 లో రిలీజ్ అయ్యి సూపర్ కలెక్షన్స్ తో మంచి హిట్ ని సాధించింది. ఈ సినిమాకు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి ఆ జాబితాలో తాజాగా జపాన్ అకడమీ అవార్డ్ కూడా దక్కించుకుంది 3 ఇడియట్స్ సినిమా. సాధారణంగా ఎడ్యుకేషన్ సిస్టంలో ముండుండే జపాన్ వారు ఈ సినిమాలో టెక్నాలజీ ఎడ్యుకేషన్ సిస్టం గురించి కొత్త కోణంలో చూపించి డిఫరెంట్ మూవీగా మంచి ప్రేక్షకాదరణ పొందిందని దర్శక,నిర్మాతలను అభినందనించదలిచారు. ఈ సినిమా బాలివుడ్ లో భారి కలెక్షన్స్ సాధించిన మొదటి సినిమాగా చరిత్ర సృష్టించింది. అమీర్ చేసిన అన్ని సినిమాలు ఆలోచనాత్మకంగా ఉండటం విశేషం. ఇక 3 ఇడియట్స్ విషయానికొస్తే ఫ్రెండ్ షిప్ యొక్క గొప్ప తనం, మానవతా విలువలు ఏంటని చెబుతూ ఒక మంచి ఫీల్ ని రిప్రెజెంట్ చేశారు డైరక్టర్ రాజ్ కుమార్ హిరాణి.. ఎపిహెరాల్డ్‌.కామ్‌ కి అందిన సమాచారం ప్రకారం 1978 నుండి సంవత్సరానికి ఒక్కసారి ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరిలో అవార్డ్స్ ఇస్తుంటారు జపాన్ ఫిల్మ్ ఫెస్ట్ వారు. ఈ ఇయర్ బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ గా 3 ఇడియట్స్ ని సెలెక్ట్ చేశారు. ఈ 37 వ జపాన్ అకడమీ అవార్డ్స్ ఫంక్షన్ మార్చ్ 7 న టోక్యోలోని హోటల్ న్యూ టకనవా లో జరుగనుంది. మరి ఈ అవార్డ్ ఫంక్షన్ కి అమీర్ అటెండ్ అవుతాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. 3 ఇడియట్స్ తో పాటుగా కెప్టెన్ ఫిలిప్స్,గ్రావిటీ అండ్ లెస్ మిసెరబుల్స్ సినిమాలు సెలెక్ట్ అయ్యాయి. అమీర్ తో పాటుగా ఈ సినిమాకు శర్మాన్ జోషి, మాధవన్ , కర్రీన కపూర్ ల నటన సినిమాకు ప్రాణం పోసాయి. ఇండియన్ సినిమా ప్రపంచ సినిమాలకు పోటీ ఇస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. 3 ఇడియట్స్ కి జపాన్ అకడమీ అవార్డ్ రావడం పై మీ స్పందన ఏంటి..? 

మరింత సమాచారం తెలుసుకోండి: