రీసెంట్ గా జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ఫెస్టివల్ లో భాగ్ మిల్కా భాగ్ సినిమా అవార్డుల పంట పండించింది. మిల్కా సింగ్ జీవిత చరిత్రతో తీసిన సినిమా భాగ్ మిల్కా భాగ్.. తక్కువ బడ్జెట్ తో చిత్రీకరించిన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించి 100 కోట్ల జాబితాలో చేరిపోయింది. ఫర్హాన్ అక్తర్ , సోనం కపూర్ నటించిన ఈ సినిమా రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించారు. ఈ సినిమా కు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కూడా బాగా వచ్చాయి. భాగ్ మిల్కా బాలివుడ్ ప్రేక్షకులను సూపర్ గా అలరించింది. ఈ సినిమాకు అన్ని కేటగిరిలో కలుపుకొని దాదాపు 6 అవార్డ్స్ ని కైవసం చేసుకుంది. ఎపిహెరాల్డ్‌.కామ్‌ కి వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమా బెస్ట్ ఫిల్మ్.. బెస్ట్ యాక్టర్.. బెస్ట్ డైరక్టర్..బెస్ట్ కాస్టూం డిజైనర్..బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్..బెస్ట్ లిరిక్ కేటగిరిలో అవార్డ్స్ వచ్చాయి. ఈ సినిమా బెస్ట్ ఫిల్మ్ గా మొదటి స్థానంలో నిలిచింది. బెస్ట్ యాక్టర్ గా ఫర్హాన్ అక్తర్.. బెస్ట్ డైరక్టర్ గా రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా..బెస్ట్ కాస్టూం డిజైనర్ గా డాలి.. బెస్ట్ లిరిక్ రైటర్ గా ప్రసూన్ జోషి..అవార్డ్స్ గెలుచుకున్నారు. ఈ సినిమాకు ఇంతటి ప్రేక్షకాదరణ పొందడం అభినందనీయమైన విషయమని డైరక్టర్ అభిప్రాయపడ్డాడు. ఇంకా ఈ సినిమా ఎన్నో అవార్డ్స్ ని గెలుస్తుందని అన్నాడు. సో మొత్తానికి మిల్కా సింగ్ జీవిత గాధపై తీసిన ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించి ఇన్ని అవార్డ్స్ సాదించడం మంచి విషయం అని అంటున్నారు సినీ వర్గాలు. సో ఆటగాడి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీసి ఇంత మంచి క్రేజ్ సంపాదించిన దర్శకుడికి హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు. ఈ విధంగా చూస్తే ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ కూడా వచ్చేట్టు ఉంది అని అభిప్రాయపడుతున్నారు కొందరు సినీ ప్రముఖులు. భాగ్ మిల్కా భాగ్ అవార్డ్స్ సాధించడంపై మీస్పందన..? భాగ్ మిల్కా భాగ్ సినిమాకు నేషనల్ అవార్డ్ వస్తుందా..? 

మరింత సమాచారం తెలుసుకోండి: