ఆఫ‌ర్ల కోసం హీరోయిన్స్ ప‌డ‌ని పాట్లు ఉండ‌వు. మొద‌టి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ కోసం త‌పించే హీరోయిన్స్‌, ఆ ఛాన్స్‌ను పొందిన త‌రువాత నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని టార్గెట్‌గా పెట్టుకుంటారు. చివ‌ర‌కు అన్ని అవ‌కాశాలు వ‌చ్చిన త‌రువాత ష‌డ‌న్‌గా అవ‌కాశాల‌ను కోల్పోతారు. ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో ఉంది శ్రద్ధాదాస్‌. ఒకప్పుడు వ‌రుస మూవీల‌ను చేసిన శ్రద్ధాదాస్‌, గ‌త కొంత కాలంగా తెలుగులో ఒక్క మూవీలోనూ న‌టించ‌కుండా, క‌న్నడ, త‌మిళ మూవీల్లో న‌టించేందుకు ఆస‌క్తి చూపింది. కాని లేటెస్ట్‌గా మెగా హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ న‌టించిన అప్‌కమింగ్ ఫిల్మ్ రేయ్ మూవీలో శ్రద్ధాదాస్ లీడ్ రోల్ పాత్రను చేసింది. ఈ మూవీ త్వర‌లోనే రిలీజ్ కాబోతుంది. మెగా హీరో స‌ర‌స‌న లీడ్ రోల్ చేస్తూ, టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్‌గా ఉంటుంది.అలా క్రేజ్ ఉన్నప్పుడే ఆఫ‌ర్లను కొల్లగొట్టాలి. ఇదే ఫార్ములాను ప్రస్తుతం శ్రద్ధాదాస్ ఫాలో అవుతుంది. అందుకే శ్రద్ధాదాస్‌ తాజాగా నాలుగు ఫోటోషూట్‌ల‌ను తీయించుకుంది. అందులో ఒకటి ఫ్రొఫిష‌న‌ల్ ఫోటోషూట్ అయితే, మూడు మాత్రం సీక్రెట్‌గా తీయించుకుంది. అలా తీయించుకున్న మూడు ఫోటోషూట్స్ మూడు బ‌డా ఆఫ‌ర్లకు సంబంధించిన ఫోటోషూట్స్. ఓ ప‌క్క ఫోటోషూట్స్‌తో క్రేజ్ ఏర్పడుతుంటే, మ‌రోవైపు ఆఫ‌ర్లు కూడ అదే రేంజ్‌లో వ‌స్తున్నాయ‌ని శ్రద్ధాదాస్ సంబర‌ప‌డిపోతుంది. శ్రద్ధాదాస్ మ‌రో మెగా హీరో స‌ర‌స‌న ఆఫ‌ర్ చేజిక్కించుకుంది. ఆ మెగా హీరో ఎవ‌రు? దానికి నిర్మాత ఎవ‌రు? అన్నదానిపై మీ అభిప్రాయాల‌ను తెలియ‌ప‌ర‌చండి.

మరింత సమాచారం తెలుసుకోండి: