టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీతో ప‌రిచ‌యం అయిన స్నేహాఉల్లాల్ త‌రువాత కొన్ని మూవీలు చేసిన‌ప్పటికి టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు దూరంగా ఉంటుంది. మూవీల ఆఫ‌ర్స్ త‌గ్గుముఖం ప‌ట్టిన సంగతి ఓపెన్ టాక్ అయినప్పటికీ, తెలుగు మూవీల‌లో న‌టించేందుకు స్నేహాఉల్లాల్ సైతం సిద్ధంగా లేదు అని టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం స్నేహా ఉల్లాల్ 'అంతా నీ మాయ‌లోనే' అనే మూవీలో న‌టిస్తుంది.ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియ‌ని ప‌రిస్థితి. అయితే ఎపిహెరాల్డ్‌.కామ్‌కి అందిన స‌మాచారం మేర‌కు స్నేహాఉల్లాల్ త్వర‌లోనే బాలీవుడ్‌లో న‌టించ‌టానికి సిద్ధంగా ఉంద‌ని రిపోర్ట్ చెబుతుంది. నిజానికి స్నేహాఉల్లాల్ మొద‌ట న‌టించిన మూవీ బాలీవుడ్ ఇండ‌స్ట్రీలోనిదే. బాలీవుడ్‌లో స‌ల్మాన్‌ఖాన్ స‌ర‌స‌న ల‌క్కీ మూవీలో న‌టించింది. ఈ మూవీలో స్నేహాఉల్లాల్ స‌ల్మాన్‌ఖాన్ స‌ర‌స‌న న‌టించింది. దీంతో స్నేహా ఉల్లాల్‌ ఒక్కసారిగా బాలీవుడ్ ఐకాన్‌గా మారింది. ఎందుకంటే స్నేహాఉల్లాల్ ఎక్స్‌ప్రెష‌న్స్‌, ఫేస్ ఎప్పిరియ‌న్స్ అంతా ఐశ్వర్యారాయ్‌ను పోలి ఉంటుంది. అందుకే స్నేహా ఉల్లాల్‌ను మ‌రో ఐశ్వర్యారాయ్‌గా బిటౌన్ కామెంట్ ఇచ్చింది. మొద‌టి మూవీతోనే స‌ల్మాన్‌ఖాన్ స‌ర‌స‌న న‌టించిన స్నేహా ఉల్లాల్‌, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌ను సైతం స‌ల్మాన్‌తోనే స్టార్ట్ చేయాల‌ని అనుకుంటుంది. త్వర‌లోనే స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న ఓ మూవీలో న‌టించేందుకు త‌ను రెడీగా ఉంద‌ని బిటౌన్ నుండి అందిన స‌మాచారం. స‌ల్మాన్‌ఖాన్‌, స్నేహా ఉల్లాల్ న‌టించ‌బోతున్న మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? స్నేహా ఉల్లాల్‌కు స‌ల్మాన్ ఖాన్‌కి ట‌చ్‌లోనే ఉందా ? ఈ విష‌యాల‌పై మీ అభిప్రాయ‌ల‌ను ఇక్కడ తెలియ‌ప‌ర‌చండి.

మరింత సమాచారం తెలుసుకోండి: