అక్కినేని ఎన్టీఆర్ ల తరువాత టాలీవుడ్ సినిమా చరిత్రను తిరగ రాసిన హీరోగా చిరంజీవి పేరు చెపుతారు. మెగా అభిమానుల గుండెలలో మెగా స్టార్ గా కొన్ని దశాబ్దాలు ఏలిన క్రేజ్ చిరంజీవి సొంతం. అటువంటి చిరంజీవి పై సహజనటి జయసుధ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆమె అభిప్రాయంలో మెగాస్టార్ చిరంజీవికన్నా ఆయన తనయుడు రామ్ చరణ్ గొప్ప నటుడు అంటూ షాకింగ్ స్టేట్మెంట్ వదిలారు  ఇటీవలె విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకున్న ఎవడు మూవీలో చెర్రీకి తల్లిగా నటించిన జయసుధ ఆసినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఆమె చెర్రీ టాలెంట్‌ని తెగ పొగుడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. ఇదే సందర్భంలో ఆమె చెర్రీ టాలెంట్ గురించి ప్రస్తావిస్తూ, ఒక మెగా హీరోకి తనయుడైనప్పటికీ చెర్రీ మాత్రం తండ్రిని అనుసరించకుండా తనకి తాను ఓ సెపరేటు స్టైల్‌ని అలవర్చుకున్నాడని ఆమె ప్రసంసల వర్షం కురిపించారు.  అంతే కాదు చిరుకి అభ్యంతరం లేకపోతే తాను ఒక మాట చెప్పాలనుకుంటున్నానని అంటూ మరో బాంబు పేల్చారు. ఆమె అభిప్రాయంలో డ్యాన్స్ విషయంలో చిరుకన్నా చెర్రీయే బెటర్ అని చెర్రీకి కాంప్లిమెంట్ కూడా ఇచ్చేసింది ఈసహజనటి.  అయితే చిరుని మెగా హీరోగా నిలబెట్టడంలో అతికీలకమైనది ఆయన డాన్స్ ప్రతిభ అని అంటారు విమర్శకులు. అటువంటిది చిరూ కన్నా చెర్రీయే బెటర్ అని జయసుధ చెప్పిన కామెంట్స్ టాలీవుడ్ లో సంచలనంగా మారాయి. రామ్ చరణ్ ను మెచ్చుకోవడం లో తప్పు లేదు కాని మరీ ఇంత అతిగానా అంటూ జయసుధ పై సెటైర్లు పడుతున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: