ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కు ఓ గుడ్ వ‌చ్చింద‌నే చెప్పాలి. ఎపిహెరాల్డ్‌.కామ్‌కి అందిన విశ్వశ‌నీయ స‌మాచారం మేర‌కు గ‌బ్బర్‌సింగ్‌2 మూవీకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ డేట్ క‌న్‌ఫ‌ర్మ్ అయ్యింది. ప‌వ‌న్‌క‌ళ్యాన్ న‌టించిన గ‌బ్బర్‌సింగ్ మూవీకు ఇది సీక్వెల్‌గా తెర‌కెక్కుతుంది. గ‌బ్బర్‌సింగ్‌2 మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ కావ‌ల్సి ఉండ‌గా, కొన్ని కార‌ణాల వ‌ల్ల షూటింగ్‌, సెట్స్ మీదకు వెళ్ళలేదు. సంప‌త్ నంది ఈ గ‌బ్బర్‌సింగ్‌2 మూవీకు డైరెక్టర్‌గా చేస్తున్నాడు. గ‌బ్బర్‌సింగ్‌2 స్క్రిప్ట్‌పై నాలుగు సార్లు మార్పులు జ‌రిగిన‌ట్టు, ఇప్పుడు ఫైన‌ల్ స్క్రిప్ట్ షూటింగ్‌కు సిద్ధంగా ఉన్నట్టు, ప్రి ప్రొడ‌క్షన్ నుండి అందిన రిపోర్ట్‌. ఈ మూవీలో ఎవ‌రు హీరోయిన్‌గా న‌టిస్తున్నారు అన్నదాపై కూడ ఓ క్లారిటి వ‌చ్చింది. హీరోయిన్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను, షూటింగ్ సెట్స్ మీద‌కు వెళ్ళే వారం రోజుల ముందు చెబుతున్నార‌ని టాక్స్ వినిపిస్తున్నాయి. మార్చి రెండో వారంలో గ‌బ్బర్‌సింగ్‌2 మూవీ షూటింగ్‌కు సిద్ధం అయింది. మొత్తానికి దీనికి సంబంధించిన అఫిషియ‌ల్ స్టేట్‌మెంట్‌ను నిర్మాత‌, డైరెక్టర్ త్వర‌లోనే ఓ ప్రెస్‌మీట్ పెట్టి అ, అనౌన్స్ చేస్తార‌ని టాలీవుడ్ టాక్‌. ఈ సంవ‌త్సరం చివ‌రిలో గ‌బ్బర్‌సింగ్‌2 మూవీ రిలీజ్ అవుతుంద‌ని టాలీవుడ్ అంటుంది. గ‌బ్బర్‌సింగ్‌2 మూవీలో కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందా? లేదా టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ అయితే బాగుంటుందా? ఈ టాపిక్స్ పై మీ అభిప్రాయాల‌ను తెలియ‌ప‌ర‌చండి.

మరింత సమాచారం తెలుసుకోండి: