న‌ట సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న అప్‌క‌మింగ్ ఫిల్మ్ లెజెండ్ మూవీకు సంబంధించిన ఓ ఆస‌క్తి క‌రమైన విష‌యాన్ని ఎపిహెరాల్డ్‌.కామ్ మీకు అందిస్తుంది. లెజెండ్ మూవీకు సంబంధించిన షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఇప్పటికే లెజెండ్ మూవీ ఫ‌స్ట్‌లుక్, నంద‌మూరి అభిమాల్ని ఎంత‌గానో అల‌రించింది. లెజెండ్ మూవీ ఫ‌స్ట్‌లుక్ టీజ‌ర్‌ను ఫిబ్రవ‌రి నెల‌లో రిలీజ్ చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చిత్ర నుండి అందిన స‌మాచారం. అలాగే లెజెండ్ మూవీను మార్చి చివ‌రి వారంలో రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని చిత్ర యూనిట్ నుండి అందిన స‌మాచారం. ఒకవేళ రిలీజ్ డేట్‌లో ఏమైనా మార్పులు వ‌స్తే ఎప్రిల్ రెండో వారంలో క‌చ్ఛితంగా రిలీజ్ ఉంటుంద‌ని టాలీవుడ్ నుండి అందిన విశ్వశ‌నీయ‌మైన స‌మాచారం. ఇదిలా ఉంటే ఈ మూవీను బోయ‌పాటి శ్రీను చాలా జాగ్రత్తగా తెర‌కెక్కిస్తున్నాడు. బోయ‌పాటి శ్రీను, బాల‌కృష్ణ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సింహా మూవీ బ్లాక్‌బ‌స్టర్ స‌క్సెస్‌ను సాధించింది. సింహా మూవీ త‌రువాత వ‌స్తున్న వీరిద్దరి కాంబినేష‌న్‌పై టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోనూ, నంద‌మూరి అబిమానుల్లోనూ విప‌రీత‌మైన క్రేజ్ ఏర్పడుతుంది. మొత్తానికి లెజెండ్ మూవీ ఫ‌స్ట్‌లుక్ టీజ‌ర్ విడుద‌ల త్వర‌లోనే ఉండ‌టంతో బాలయ్య అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో బాల‌కృష్ణ స‌ర‌స‌న రాధికా ఆఫ్టే హీరోయిన్‌గా చేస్తుంది. బాల‌కృష్ణ న‌టిస్తున్న లెజెండ్ మూవీను స‌మ్మర్‌లో రిలీజ్ చేస్తే బాగుంటుందా? లేక ఆంద్రప్రధేశ్ అసెంబ్లీ ఎక‌ల‌క్షన్స్ స‌మయంలో రిలీజ్ చేస్తే బాగుంటుందా? వ‌ంటి విష‌యాల‌పై మీ అభిప్రాయాల‌ను తెలియ‌పర‌చ‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: