టాలీవుడ్ మెగాహీరో రామ్‌చ‌ర‌ణ్ అంటే విప‌రీత‌మైన క్రేజ్‌. రామ్‌చ‌ర‌ణ్ మూవీ కోసం చాలా మంది డైరెక్టర్లు క్యూ క‌డుతూ ఉంటారు. రామ్‌చ‌ర‌ణ్ కాల్షీట్స్ కోసం చాలా మందికి హై లెవ‌ల్ రిక‌మెండేష‌న్లు కావాలి. అలాంటిది, ఓ స‌న్షేన‌ల్ డైరెక్టర్ రామ్‌చ‌ర‌ణ్‌ను టార్గెట్ చేసుకొని మాట్లాడాడు. రామ్‌చ‌ర‌ణ్‌ను అంతలా టార్గెట్ చేసిన డైరెక్టర్ ఎవ‌రు అంటే త‌నే తేజ‌. ఈ మ‌ధ్య కాలంలో తేజ మూవీలు బాక్సాపీస్ వ‌ద్ద బోల్తా కొడుతున్నాయి. ఎంతో హైప్‌తో వ‌చ్చినా, క‌లెక్షన్స్ మాత్రం చాలా త‌క్కువుగా ఉంటున్నాయి. గ‌త కొద్ది సంవ‌త్సరాల క్రితం తేజ మూవీ అంటే థియోట‌ర్ల ద‌గ్గర క్యూలు క‌ట్టే యూత్ కూడ, ఇప్పుడు తేజ మూవీ అంటే ఆ మూవీను చూడ‌టానికి సైతం ఆస‌క్తి చూప‌డం లేదు. ఏదేమైనా లేటెస్ట్‌గా తేజ, త‌న మాట‌ల‌తో ఇబ్బందుల్లో ప‌డ్డాడ‌నే చెప్పాలి. తేజ‌, వ‌న్ మూవీకు సంబంధించిన ఓ స్టేట్‌మెంట్‌ను ఇచ్చాడు. వ‌న్ మూవీ రిలీజ్ అయిన మొద‌టి రోజు, ఫ్యాన్స్‌కు ఆ మూవీ న‌చ్చలేదు. కాని సాయంత్రానికే వ‌న్ మూవీ రియ‌ల్ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చిందంటూ కామెంట్ చేశాడు. వ‌న్ మూవీ టాలీవుడ్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకువెళ్ళింది, ప్రస్తుతం వ‌స్తున్న మూవీలు అన్నీ ఆరు పాటలు, నాలుగు ఫైట్స్‌తోనే వ‌స్తున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన మూవీల‌లో వ‌న్ మూవీ చాలా బెటర్ అంటూ ఇండైరెక్ట్‌గా రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన ఎవ‌డు మూవీను కామెంట్ చేశాడు. తేజ ఈ విధంగా మాట్లాడ‌టంతో అంద‌రూ షాక్ అయ్యారు. తేజ, ఎవ‌డు మూవీపై ఎందుకు ఈ విధంగా స్పంధించి ఉంటాడు? ఎవ‌డు, వ‌న్ మూవీల‌పై మీ అభిప్రాయం ఏమిటి? ఈ విష‌యాల‌పై మీ స్పంధ‌న‌ల‌ను ఇక్కడ తెలియ‌జేయ‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: