ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు టాలీవుడ్ టాప్ హీరోల అంద‌రి కంటే కొంచెం భిన్నమైన క్రేజ్ ఉంటుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడ అదే రేంజ్ లో ఉంటుంది. అలాగే డైరెక్టర్స్ అంద‌రిలోనూ రాజ‌మౌళీ టేకింగ్‌, క్రియోష‌న్ చాలా భిన్నంగా ఉంటుంది. హీరోల‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, డైరెక్టర్స్‌లో రాజ‌మౌళి అంటూ టాలీవుడ్‌లో చాలా మంది చ‌ర్చించుకుంటారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేష‌న్‌లో ఓ మూవీ రాబోతుంద‌ని టాలీవుడ్ నుండి అందిన స‌మాచారం. రీసెంట్‌గా రాజ‌మౌళి, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ను క‌లిసి త‌న‌కు ఓ క‌థ‌ను వినిపించాడాని టాక్స్ వినిపిస్తున్నాయి. దీనిపై ఎపిహెరాల్డ్.కామ్ వ‌ద్ద విశ్వశ‌నీయ‌మైన స‌మాచారం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివారాల‌ను ఎపిహెరాల్డ్‌.కామ్ మీకు అందిస్తుంది. గ‌త కొద్ది రోజుల క్రితం రాజ‌మౌళి, ప‌న‌న్‌క‌ళ్యాణ్‌ను క‌లిశాడు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు ఉన్న సొంత ఫాం హౌస్‌లోనే ప‌వ‌న్‌ను రాజ‌మౌళి క‌లిశాడు. రాజ‌మౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం ఓ క‌థ‌ను రాశాడు. ఆ క‌థ‌ను ప‌వ‌న్‌కు రాజ‌మౌళి వివ‌రించాడు. ఆ స్టోరిను విన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఎంతో ఇంప్రెస్ అయ్యాడ‌ని, ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేద్ధాం అంటూ అడిగాడ‌ని టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే రాజ‌మౌళి ప్రస్తుతం బాహుబ‌లి మూవీకు సంబంధించిన షూటింగ్‌లో బిజిగా ఉన్నాడు. 2015 వ‌ర‌కూ రాజ‌మౌళి, బాహుబ‌లి మూవీతో బిజిగా ఉంటాడు. ఆ త‌రువాత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో రాజ‌మౌళి మూవీ ఉంటుంద‌ని టాలీవుడ్ నుండి అందిన విశ్వశ‌నీయ‌మైన స‌మాచారం. వీరిద్దరి కాంబినేష‌న్‌లో మూవీ వ‌చ్చిందంటే అది ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించటానికే బాక్సాపీస్‌కు షేక్ వ‌స్తుందంటున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: