యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో త‌న‌దైన స్థానాన్ని, స్టార్‌డంను క్రియోట్ చేసుకున్నాడు. యంగ్ టైగ‌ర్ కాల్షీట్స్ కోసం నిర్మాత‌లు, డైరెక్టర్లు క్యూలు క‌ట్టాల్సిందే. ఇంత‌టి స్టార్‌డంను క‌లిగిన ఎన్టీఆర్ గ‌త కొంత కాలంగా త‌న మూవీల స్టామినాతో బాక్సాపీస్‌ను షేక్ చేయ‌లేక‌పోతున్నాడు. అయితే ఓవ‌ర్సీస్ మార్కెట్‌లో మాత్రం యంగ్‌టైగ‌ర్ బిజినెస్ బాగా పెరిగింద‌ని టాలీవుడ్ ట్రేడ్స్ చెబుతున్నాయి. ఇదిలా ఉంటే యంగ్ టైగ‌ర్‌కు ఇప్పుడు కొత్త ఆలోచ‌న‌లు చేస్తున్నాడు. జూనియ‌ర్ ఎన్టీఆర్ త్వర‌లోనే సొంత ప్రొడ‌క్షన్‌ను ప్రారంభించబోతున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన స‌మాచారాన్ని ఎపిహెరాల్డ్‌.కామ్ మీకు అందిస్తుంది. గ‌త రెండు సంవ‌త్సరాల క్రిత‌మే ఎన్టీఆర్‌, సొంత ప్రొడ‌క్షన్ సంస్థను స్థాపించాలి అనుకున్నాడు. త‌ను న‌టిస్తున్న మూవీల బాక్సాపీస్ రిజ‌ల్ట్ అనుకున్నంత‌గా రాక‌పోవ‌డంతో ఆ ఆలోచ‌న‌ల‌ను పోస్ట్‌పోన్ చేస్తూ వ‌స్తున్నాడు. అయితే, ఇప్పుడు మాత్రం సొంత ప్రొడ‌క్షన్‌ను ప్రారంభించాలి క‌చ్ఛిత‌మైన నిర్ణయాన్ని తీసుకున్నాడ‌ట‌. దీనికి సంబంధించిన ప‌నులు కూడ ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ ర‌భ‌స మూవీకు సంబంధించిన షూటింగ్‌లో బిజిగా ఉన్నాడు. త‌రువాత సుకుమార్‌తో ఓ మూవీను చేసే ఆలోచ‌న‌లో ఉన్నాడు. సుకుమార్ మూవీ త‌రువాత ఎన్టీఆర్ నిర్మాణ సార‌ధ్యంలో ఓ చిన్న మూవీను నిర్మించే ఆలోచ‌న‌లో ఉన్నట్టు టాలీవుడ్ నుండి అందిన స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: