ఈ రోజుల్లో రెమ్యున‌రేష‌న్‌ను త‌గ్గించుకొని న‌టించేవారు ఉన్నారంటే వాళ్ళకు చేతులు ఎత్తి న‌మ‌స్కారం పెడ‌తుంది ఫిల్మ్ ఇండ‌స్ట్రీ. ముఖ్యంగా హీరోయిన్స్‌కు రోజు రోజుకి రెమ్యున‌రేష‌న్ డ‌బుల్‌, ట్రిబుల్ అవుతుంది. అలాంటి బాలీవుడ్‌లోని ఓ హీరోయిన్ మాత్రం త‌న రెమ్యున‌రేష‌న్‌ను త‌గ్గించుకొని అంద‌రిని అవాక్కుచేసింది. ఈ విధంగా వార్తల్లో కెక్కిన టాప్ హీరోయిన్ పేరే క‌రీనాక‌పూర్‌. అది గ్రీన్ టీ ప్రొడక్ట్‌కి సంబంధించిన అడ్వర్టయిజ్‌మెంట్. మాంచి అగ్రిమెంట్, కోట్లలో రెమ్యునరేషన్‌ను ఆఫ‌ర్ చేశారు. మార్కెట్‌లో కరీనాకి ఉన్న డిమాండ్‌ని బట్టి చూస్తే ఈ అడ్వర్టయిజ్‌మెంట్‌కి కనీసం నాలుగైదు కోట్ల రూపాయ‌లు ఇవ్వొచ్చు అని వారు అగ్రిమెంట్‌ను మాట్లాడారు. కానీ త‌ను మాత్రం ‘మూడు’ చాలంటోందట. ఇదేమిటి? అని అనుకుంటున్నారా? ఇక్కడే చిన్న మ‌త‌ల‌బు ఒక‌టి ఉంది. గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆ ప్రొడక్ట్‌ని ప్రచారం చేయాల్సిన బాధ్యత అందరిదీ. 'ప్రజల పక్షాన నేను చేస్తున్నా. ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నామన్నది కాదు. జనానికి మంచి మేసేజ్ ఇచ్చామా లేదా అన్నది కావాలి' అని నీతి సూత్రాలు చెబుతుంది. ఈ మాట‌ల వెనుక ఉన్న విష‌యాన్ని తెలుసుకుంటే, ఆ ‘గ్రీన్ టీ’ని ఎవరో ఒకరు ఎగరేసుకెళ్తారన్న తాపత్రయం కొద్దీ ఒప్పేసుకొని, ఇప్పుడు ఇటువంటి కబుర్లన్నీ చెబుతోంద‌ని బిటౌన్ ఓపెన్‌గా చెబుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: