రామ్‌చ‌ర‌ణ్ త‌న ఫిల్మ్ కెరీర్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. జంజీర్ మూవీ త‌రువాత చాలా గ్యాప్ తీసుకొని కేవ‌లం ఒకే ఒక్క క‌థ‌కు ఓకె చెప్పాడు. అదీనూ క్రియోటివ్ డైరెక్టర్ క్రిష్ణవంశీ చెప్పిన ప్యామిలీ ఓరియంటెడ్ మూవీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. క్రిష్ణ‌వంశీ ఎప్పటి నుండో రామ్‌చ‌ర‌ణ్ కోసం ఓ క‌థ‌ను రెడీ చేశాడు. అయితే ఆ క‌థ‌లో కొద్దిపాటి మార్పుల‌ను చేయ‌మ‌ని కృష్ణ‌వంశీకు చెప్పాడు. దాంతో చ‌ర‌ణ్ అభిరుచి మేర‌కు కృష్ణవంశీ అద్భుత‌మైన క‌థ‌ను రెడీ, ఆ ప్రాజెక్ట్‌ను సెట్స్ మీద‌కు తీసుకువ‌చ్చాడు. ఈ ప్రాజెక్ట్‌పై చ‌ర‌ణ్‌కు గ‌ట్టి న‌మ్మకం ఉంది. అలాగే త‌న త‌రువాతి మూవీను ఓ మంచి డైరెక్టర్‌తో తీయాల‌ని ఇప్ప‌టి నుండే దానికి సంబంధించిన పనుల్లో బిజిగా ఉన్నాడు. ఆ విధంగా వ‌చ్చిన క‌థ‌ల్లో యాక్షన్ డైరెక్టర్ బోయ‌పాటి శ్రీను చెప్పిన క‌థ‌కు చ‌ర‌ణ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు టాలీవుడ్ నుండి అందిన స‌మాచారం. ఎపిహెరాల్డ్‌.కామ్ కి అందిన న్యూస్ ప్రకారం రామ్‌చ‌ర‌ణ్‌, కృష్ణవంశీ మూవీ త‌రువాత బోయ‌పాటి శ్రీను గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడ‌ని తెలుస్తుంది. ప్రస్తుతం బోయ‌పాటి శ్రీను, లెజెండ్ మూవీ షూటింగ్‌లో బిజిలో ఉన్నాడు. అలాగే రామ్‌చ‌ర‌ణ్ కృష్ణవంశీ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. మొత్తానికి బోయ‌పాటి శ్రీను, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్ ఓకె అయితే అది స‌క్సెస్ కాంబినేష‌న్ అవుతుంద‌ని ఇప్పటి నుండే టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. రామ్‌చ‌ర‌ణ్‌,కృష్ణవంశీ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీకు ఏ టైటిల్ పెడితే బాగుండుంది? ఈ టాపిక్‌పై మీ అభిప్రాయాల‌ను ఇక్కడ తెలియ‌ప‌ర‌చండి

మరింత సమాచారం తెలుసుకోండి: