టాలీవుడ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ కాంబినేష‌న్ మూవీ త్వర‌లోనే తెర‌కెక్కబోతుంది. ఈ మూవీకు డైరెక్టర్‌గా మ‌ణిర‌త్నంగా చేస్తుండ‌గా హీరోలుగా నాగార్జున‌, మ‌హేష్‌బాబు న‌టిస్తున్నారు. ఈ మూవీకు సంబంధించిన ప్రాజెక్ట్ ప‌నులు కూడ శ‌ర‌వేగంగా ముందుకు వెళుతున్నాయి. మ‌ణిర‌త్నం చెప్పిన క‌థ‌కు మ‌హేష్‌బాబు, నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చార‌ని, అలాగే వీరిద్దరూ క‌లిసి ఒకే మూవీలో న‌టించ‌టానికి కూడ ఎటువంటి ఇబ్బంది ఏమి లేదంటూ కామెంట్స్ కూడ ఇచ్చుకున్నారు. ఇదిలా ఉంటే మ‌ణిర‌త్నం ఆఫిస్ నుండి ఎపిహెరాల్డ్‌.కామ్‌కు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అందింది. ఈ మ‌ల్టీ స్టార‌ర్ ఫిల్మ్‌కు మ‌ణిర‌త్నం ఇప్పటికే ఐశ్వర్యరాయ్‌ను సంప్రదించాడు. ఈ విష‌యం అంద‌రికి తెలిసిందే. అయితే లేటెస్ట్‌గా మ‌రో హీరోయిన్‌ను మ‌ణిర‌త్నం క‌లిసాడు. త‌నే శృతిహాస‌న్‌. మ‌ణిర‌త్నం తీస్తున్న అప్‌క‌మింగ్ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా న‌టించాలంటూ శృతిహాస‌న్‌ను కోరాడంట‌. అందుకు శృతిహాస‌న్ కూడ ఒప్పుకుంద‌ని కోలీవుడ్ స‌మాచారం. అయితే ఈ ఇద్దరి హీరోయిన్స్ నుండి క‌చ్ఛిత‌మైన క్లారిఫికేష‌న్ మాత్రం రాలేదు. ఒకవేళ ఇద్దరూ మ‌ణిర‌త్నం తీస్తున్న అప్‌క‌మింగ్ మ‌ల్టీస్టార‌ర్ ఫిల్మ్‌కు ఓపె చెబితే, నాగార్జున స‌ర‌స‌న ఐశ్వర్యారాయ్‌ను, మ‌హేష్‌బాబు స‌ర‌స‌న శృతిహాస‌న్‌ను ఓకె చేసిన‌ట్టుగా మ‌ణిర‌త్నం ఆలోచిస్తున్నాడు. మొత్తానికి శృతిహాస‌న్ మాత్రం మ‌ణిర‌త్నం ఆఫ‌ర్‌తో ప్రిన్స్ స‌ర‌స‌న ఛాన్స్ కొట్టేసి, తెగ హ్యాపిగా ఉందంట‌. మ‌ణిర‌త్నం అప్‌క‌మింగ్ మూవీలో ఐశ్వర్యరాయ్‌, శృతిహాస‌న్ ఇద్దరూ హీరోయిన్ అయితే, వీరిద్ద‌రిలో ఎవ‌రు నాగార్జున,మ‌హేష్‌బాబుల స‌ర‌స‌న న‌టిస్తే బాగుంటుంది? మీ పోలింగ్‌ను ఇక్క‌డ తెలియ‌ప‌ర‌చండి.

మరింత సమాచారం తెలుసుకోండి: