టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్‍ ఒక నిండుకుండ లాంటివాడు. ఆయన ప్రొఫెషనల్‌ కెరీర్ తో పాటు పర్సనల్ లైఫ్‌లో కూడా ఎన్నో రహస్యాలు. ఆ రహస్యాలన్ని ఇప్పుడు వెలుగులోకి రాబోతున్నాయి.పవన్ కళ్యాణ్‍ ఒక మతం. ఈ మతం గురించి తెల్సుకోవాలని ఫ్యాన్స్ అభిమతం. ఫ్యాన్స్ పడే ఈ ఆరాటానికి ప్రముఖ జాతీయ పత్రిక ఇండియాటుడే అద్దంపడుతోంది. ఔను, పవన్ కళ్యాణ్‍పై 120 పేజీల స్పెషల్‌ ఎడిషన్ ని ఇండియాటుడే విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన స‌మాచారాన్ని ఎపిహెరాల్డ్‌.కామ్ మీకు అందిస్తుంది. పవన్ కళ్యాణ్‍కు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్‌ ఫోటోలతో ఇండియాటుడే స్పెషల్‌ ఎడిషన్ని రెడీ చేస్తోంది. ఇందులో పవన్ ప్రొఫెషనల్‌ లైఫ్ తో పాటు పర్సనల్‌ విషయాల్ని కూడా పొందుపరుస్తారు. ‘పవర్ ఫుల్‌ స్టార్- స్మైల్‌ అండ్ స్మార్ట్ స్టార్’ శీర్షికతో ఈ స్పెషల్‌ ఎడిషన్ని ఇండియా టుడే విడుదల చేయనుంది. ఈ స్పెషల్‌ ఎడిషన్ లో పవన్ కళ్యాణ్‍ను తన అన్నయ్య చిరంజీవితో పాటు ఇతర టాప్ స్టార్లతో పోలుస్తారని వార్తలు వస్తున్నాయ్. ఇండియా టుడే స్పెషల్‌ ఎడిషన్ రూపంలో పవన్ కళ్యాణ్‍కు మరో అరుదైన గౌరవం దక్కినట్టయింది. గతంలో చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబులపై ఇండియాటుడే స్పెషల్‌ ఎడిషన్ని విడుదల చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్‍పై స్పెషల్‌ ఎడిషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించి మెగా అభిమానుల్ని ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్‍కు సంబంధించి ఇండియాటుడే విడుదల చేసే స్పెషల్‌ ఎడిషన్ హాట్‍ కేకుల్లా అమ్ముడు పోవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: