డేవిడ్ ధావన్ డైరక్ట్ చేస్తున్న సినిమా మై తేరా హీరో.. తెలుగు కందిరీగ సినిమా రీమేక్ గా రాబోతున్న ఈ సినిమాపై బీ టౌన్ లో అంచనాలు బాగా ఉన్నాయి. టాలీవుడ్ లో సూపర్ హిట్ కొట్టిన ఈ సినిమా అక్కడ కూడా మంచి కలెక్షన్స్ ని తెస్తుందని నమ్ముతున్నారు ఆ చిత్ర యూనిట్. ఆ మాటను నిజం చేస్తూ ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే యూ ట్యూబ్ లో 2 మిలియన్స్ హిట్స్ వచ్చాయట. జాన్ 23 న రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందట. తెలుగులో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, హాన్సిక ఇంకా అక్ష లు హీరోయిన్లుగా చేశారు. ఇక అక్కడ మై తేరా హీరో సినిమాలో డేవిడ్ ధావన్ తనయుడు వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్నాడు. అంతేకాదు ఇందులో హీరోయిన్లుగా చిట్టి నడుము సుందరి ఇలియానా ఇంకా హాట్ గర్ల్ నర్గీస్ ఫక్రిలు చేస్తున్నారు. ఈ ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ కి ఆ చిత్ర యూనిట్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలానే సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు దర్శకనిర్మాతలు. మై తేరా హీరో సినిమాను బాలాజి మోషన్ పిక్చర్స్ బ్యానర్లో ఎక్తా కపూర్ నిర్మిస్తున్నారు. ట్రైలర్ తోనే ఇంతటి సంచలనం సృష్టించిన మై తేరా హీరో సినిమా వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 4 న రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా మంచి సక్సెస్ సాధించి 100 కోట్ల క్లబ్ లో నిలవాలని ఆశిస్తుంది ఎపిహెరాల్డ్.కామ్. మై తేరా హీరో మూవీ హిట్ అవుతుందా..?కందిరీగ సినిమా రీమేక్ పై మీ స్పందన..?

మరింత సమాచారం తెలుసుకోండి: