సినిమా తీశామా లేదా అన్నది కాదు బొమ్మ ఆడిందా లేదా అన్నదే ముఖ్యం… పెద్దదైనా చిన్నదైనా నచ్చాలేకానీ సూపర్ హిట్ చేసేంత గొప్పమనసున్నోళ్లు ప్రేక్షకులు… అదే నమ్మకంతో వచ్చే నెలలో చిన్నసినిమాలు రిలీజ్కి రెడీ అవుతున్నాయి.. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడంతా చిన్న సినిమాలదే జోరు.2014 సంక్రాంతి సీజన్ చప్పగా ముగిసిందనే చెప్పాలి.. నిజానికి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయినా పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. సిని అభిమానుల ఆకలిని తీర్చడానికి రాబోయే రెండు నెలల్లో దాదాపు 7 సినిమాలు రిలీజవుతున్నాయి. ఆ సినిమాలేంటి? వాటి ప్రత్యేకతలేంటో చూద్దాం.బాలీవుడ్ తర్వాత పెద్ద మార్కెట్ ఉన్న ఇండస్ట్రీ టాలీవుడ్ ఇంచుమించు వారానికో సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా పెద్దదా చిన్నదా అన్నది కాదు సినిమా బాగుందంటే చాలు చిన్న సినిమా అయినా ఆడియెన్స్ దాన్ని పెద్ద హిట్ చేసేస్తారు. సంక్రాతి సినిమాల జోరు కొనసాగించలేదని డల్ అయిన ఆడియెన్స్ ను ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో వరుస సినిమాలు అలరించడానికి రెడీగా ఉన్నాయని ఎంతో జోష్ గా ఉన్నారు. ఇక పోతే ఈ సినిమాలు సమ్మర్ కి ముందే రిలీజ్ అయ్యి సమ్మర్ వేడి ని మనకు ముందె చూపించబోతున్నాయి. ఈ ప్రి సమ్మర్ పోరులో ముందుగా ఉన్న సినిమా ఆటోనగర్ సూర్య.. చాలా కాలంగా రిలీజ్ కి నోచుకోని ఈ సినిమా ఎట్టకేలకు ఫిబ్రవరి 7 న రిలీజ్ కి రెడి అయ్యింది. ఏ మాయ చేశావే జంట కలిసి చేస్తున్న సినిమా కాబట్టి ఆడియెన్స్ ని అలరిస్తుందని నమ్ముతున్నారు. ప్రస్థానం సినిమాతో దర్శకుడిగా తనేంటో ప్రూవ్ చేసుకున్న దేవ కట్టా మరో సారి ఆటోనగర్ సూర్య తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో ఈ సినిమాను ఆర్.వెంకట్ నిర్మిస్తున్నారు. ట్రైలర్స్ లో పవర్ఫుల్ డైలాగ్స్ తో పర్ఫెక్ట్ గా కనిపిస్తున్న చైతన్య ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. లాస్ట్ ఇయర్ నాని ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు… కానీ ఈ రెండు నెలల్లో ఏకంగా మూడు సినిమాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. సినిమాలో నటించేది హీరో, హీరోయిన్ అయినా..సినిమాను ఎంతో అద్భుతంగా దర్శకుడు చిత్రీకరించినా.. దాని భవితవ్యం తేల్చేది మాత్రం ప్రొడ్యూసర్ మాత్రమే. దీనికి బెస్ట్ ఎక్సాంపుల్ నానినే. నాని చేసిన పైసా సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉంది కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా కొన్ని నెలల పాటు ల్యాబ్లోనే ఉండిపోయింది. ఇక చివరకు ఈ సినిమా బయటికి రాదు అనుకుంటున్న సమయంలో నిర్మాత రమేష్ పుప్పాల పైసా సినిమాను ఫిబ్రవరి 7 న రిలీజ్ అని ప్రెస్ నోట్ ఇచ్చాడు. ఈ సినిమాతో పాటు నాని జెండా పై కపిరాజు కూడా అదే రోజున రిలీజ్ అవ్వనుంది. ఒకే హీరో రెండు సినిమాలు రిలీ అవ్వడం ఇప్పటికాలం వారికి కొత్తే కాని పాతకాలంలో ఇలా చాలానే జరిగాయి. ఇక ఇదే కోవలో నాని నటించిన యష్ రాజ్ చోప్రా వారి ఫిల్మ్ ఆహా కళ్యాణం కూడా ఫిబ్రవరి 14 న రిలీజ్ చేస్తున్నారని టాక్. సో ఈ ఫిబ్రవరి నెల నాని ని ఆడియెన్స్ మూడు సినిమాల్లో..మూడు డిఫరెంట్ క్యారక్టర్స్ లో చూడొచ్చు. ప్రస్తుతం సినిమాలు రిలీజ్ చేయకపోతే సమ్మర్ రేస్లో పెద్ద హీరోలు ఉంటారు కాబట్టి.. నిర్మాతలు ముందే జాగ్రత్తపడుతున్నారు. వచ్చే రెండు నెలల్లోనే సినిమాలు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సమ్మర్ కి ముందే రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాల్లో ఒకటి శేఖర్ కమ్ముల అనామిక. శేఖర్ కమ్ముల సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. కూల్ గా ఉంటూ మంచి మెసేజ్ ఇచ్చేలా ఉంటాయి. నయనతార మెయిన్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాను ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా చిన్న చిన్న మార్పులు చేస్తున్నాడు దర్శకుడు. ఈ సినిమా కథ ముందే తెలుసు కాబట్టి ఆడియెన్స్ ని ఓవర్ ఎక్స్పెక్టేషన్ తో ఊహించుకుని వెళ్లే ఆలోచన ఉండదు. ఇక శేఖర్ ఈ సినిమాను ఎలాగైనా హిట్ చేయాలనే తాపత్రయంతో ఉన్నాడట. తన లాస్ట్ సినిమా లై ఈజ్ బ్యూటిఫుల్ కూడా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు కాబట్టి ఈ సినిమాను కచ్చితంగా హిట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు శేఖర్ కమ్ముల. ఇక ఈ సినిమాల రేస్ లో పోటీకి వస్తున్నాడు సాయి ధరం తేజ్.. రేయ్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న ఈ హీరో చిరు ఫ్యామిలీ నుండి వస్తున్నాడనే సరికి అందరి దృష్టిని ఆకర్షించాడు. వై.వి.యస్.చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆడియో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రిలీజ్ చేపించి సినిమాకు సూపర్ క్రేజ్ వచ్చేలా చేశాడు. ఇక ఈ చిన్న సినిమాల పోరులో నేను పోటీ పడతా అంటూ వస్తున్నాడు అల్లు వారి హీరో శిరీష్. మొదటి సినిమా గౌరవంతో ఫ్లాప్ చూసిన ఈ హీరో.. కొత్తజంట సినిమాను ఎలాగైన హిట్ చేసుకోవాలనే కసితో వర్క్ చేస్తున్నాడు. అల్లు శిరీష్ హీరోగా మారుతి డైరెక్షన్లో వస్తున్న సినిమా కొత్తజంట. యూత్ సబ్జెక్ట్ కి కొంచం అడల్ట్ కామెడీని జోడించి మారుతి చేసే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి హడావిడే చేస్తున్నాయి. సో ఆ జాబితాలో ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుందని ఆశిస్తోంది చిత్రయూనిట్. కొత్తజంట సినిమాలో అల్లు శిరీష్ కి జోడిగా నటిస్తోంది బబ్లీ బేబీ రెజీనా.. మారుతి రిలీజ్ చేసిన ట్రైలర్స్ చూస్తుంటే వీరిద్దరి జంట నిజంగానే కొత్తగా అనిపిస్తుంది. చిన్న సినిమా గా పెద్ద బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఇదీ వచ్చే నెలలో రిలీజవుతున్న చిన్న సినిమాల జోరు. ఈ సినిమాలన్ని మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటుంది ఎపిహెరాల్డ్.కామ్. ఈ సినిమాలన్నిటిలో ఏ సినిమా సూపర్ హిట్ అవుతుంది..?

మరింత సమాచారం తెలుసుకోండి: