సినిమాకు కధా వస్తువు ఇది అంటూ ఏదీ ప్రత్యేకంగా వుండదు... ప్రేక్షకుల అభిరుచికి పెద్దపీట వేస్తూ సమకాలీన సంగతులకు అద్దంపడుతూ సినిమా కధలు తయారవుతుంటాయి , ఆ కధకు అనుగుణంగా కధానాయకుడి పాత్ర తీర్చిదిద్దబడుతూ వుంటుంది. ఈ మద్య సమాజంలో మీడియా ఎన్నో సంచలనాలు సృష్టిస్తోంది. దాంతో సినిమా కధల్లో మీడియా ఓ భాగమైపోయింది. మన హీరో , హీరోయిన్ లు జర్నలిస్ట్ అవతారం ఎత్తేస్తున్నారు. సినిమాల్లో మీడియా పై స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. హీరో రవితేజా ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ఆంజనేయులు .. ఆ సినిమాలో రవితేజా ఓ న్యూస్ ఛానల్ లో పనిచేస్తుంటారు. రవితేజా మార్క్ యాక్షన్ తో ప్రతి సన్నివేశం సరదాలు పంచుతుంది. ఓ ఛానల్ లో కధంతా నడుస్తున్నప్పుడు అందులో జరిగే ప్రతి సన్నివేశం ప్రేక్షకులను హాయిగా అలరిస్తుంది. ఆంజనేయులు చిత్రంలో సినిమా ప్రమోషన్ ఇంటర్వూలు , వంట కార్యక్రమాలు భలేగా నవ్విస్తాయి. ఛానల్ రేటింగ్స్ కోసం అంటూ ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టేసి కొందరు క్రియేటివ్ హెడ్ లు తలా తోకలేని ప్రోగ్రామ్ లు ప్లాన్ చేస్తుంటారు. వీళ్లందరికి ప్రతినిధిలా ఆంజనేయులు చిత్రంలో బ్రహ్మానందం క్యారెక్టర్ వుంటుంది. ఈయన గారి క్రియేటివిటీ కి రవితేజా వేసే బ్రేకులు కామెడీని పండిస్తాయి. ఇటీవల విడుదలై భారీ సంచలనం సృష్టించిన చిత్రం రంగం. ఈ మూవీలో హీరో జీవా ఓ పత్రికలో ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తుంటారు. సమకాలీన రాజకీయాలను రాజకీయనాయకులను ఫోకస్ చేస్తూ సాగే కధలో జీవా హీరోయిజం మీడియా స్వేచ్ఛకు అద్దంపడుతూ సాగుతుంది. గతంలో సినిమా కధలో మీడియా మీద సెటైర్ లు అడపాదడపా కనిపిస్తూ నవ్వించేవి. అలాంటి వాటిలో పోకిరి చిత్రంలోని సాయాజీ షిండే ప్రెస్ మీట్ ని ప్రత్యేకంగా చూడోచ్చు. డైరెక్టర్ పూరి జగన్నాద్ అవకాశాన్ని బట్టి మీడియా మీద సెటైర్లు వేస్తుంటారు. నేనింతే చిత్రంలో కూడా ఛానళ్ల పై, వెబ్ సైట్ లపై బోలెడు విసుర్లు వున్నాయి. పూరి జగన్నాద్, అల్లుఅర్జున్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం దేశముదురు. ఈ మూవీలో హీరో అల్లు అర్జున్ ఓ ప్రముఖ టి.వి. ఛానల్ లో పనిచేస్తుంటారు. ఈ సినిమాలో కూడా పూరి జగన్ టి.వి. ఛానల్ ను, ప్రోగ్రాంలను అడ్డంపెట్టుకుని కామెడీని క్రియేట్ చేశారు. క్రియేటివి డైరెక్టర్ కృష్టవంశీ కూడా రాఖీ చిత్రంలో సందర్బం చూసుకుని ట.వి. ఛానల్స్ పై కామెడీగా చురకలు అంటించారు. ఇదే చిత్రంలో కృష్ణవంశీ మీడియా ఓవరాక్షన్ పై కూడా విరుచుకుపడ్డారు. అర్దం తెలీకపోయినా ఆవేశపడే ఛానల్ అధినేత అయిన బ్రహ్మానందం పాత్ర ద్వారా కృష్ణవంశీ మీడియా పై తనకున్న కసిని ప్రదర్శించారు. భూమిక హీరోయిన్ గా రవిబాబు దర్శకత్వంలో రూపోందిన చిత్రం అనసూయ. ఈ మూవీలో భూమిక ఓ టివి ఛానల్ లో పని చేస్తూ వుంటుంది. క్రైమ్ బేస్డ్ గా సాగే ఆ కధలో భూమిక క్యారెక్టర్ కి ఎంతో ప్రాముఖ్యత వుంటుంది. అమీర్ ఖాన్ నిర్మాతగా మారి రూపోందించిన చిత్రం పీప్లీ లైవ్.. ఓ సాదారణ రైతు ఆత్మహాత్యల అంశాన్ని టి.వి. ఛానళ్లు ఎలా హైలైట్ చేసి అల్లరి పెడతాయి అనే కధాంశంతో రూపోందిన ఆ చిత్రం ఆద్యంతం నవ్వులు పంచింది. రవి చావలి దర్వకత్వంలో జగపతి బాబు హీరోగా నటించిన చిత్రం సామాన్యుడు. ఈ మూవీలో హీరో జగపతిబాబు జర్నలిస్ట్ గా రాజకీయ అవకాశవాదాన్ని ప్రశ్నిస్తాడు. ఈ మూవీ విజయంతో హీరోలకు జర్నలిస్ట్ పాత్రలపై క్రేజ్ పెరిగిందనే చెప్పాలి. అప్పటిదాకా మీడియా పై సెటైర్లు , ప్యారడీలు చేసిన రచయిత, దర్శకులు ఒక్కసారి తమ కోణాన్ని మార్చుకున్నారు. సంచలన దర్శకుడు పూరి జగన్నాద్ , పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కించిన కెమరామేన్‌ గంగతోరాంబాబు సినిమాలో కూడా కథ అంతా మీడియా చూట్టూనే తిరుగుతుంది.. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను చూసి చలించిన ఓ యువకుడు తను అనుకున్నది సాధించటానికి మీడియాను ఎలా వాడుకున్నాడు అన్నది అద్భుతంగా చూపించారు పూరి.. అలాగే గుణశేఖర్ దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ నటించిన సైనికుడు సినిమాలో మీడియా తో మాట్లాడే సీన్ ఆ సినిమా కే హైలైట్.మీడియా ద్వారా చెపితే ప్రేక్షకులు తొందరగా కనెక్ట్ అవుతారని దర్శకుల నమ్మకం. అందుకే దర్శకులు చెప్పదలచుకున్న పాయింట్ మీడియా ద్వారా వ్యక్త పరుస్తారు.. సినిమాలో మీడియా గురించి రావడంపై మీ స్పందన..?

మరింత సమాచారం తెలుసుకోండి: