సినిమాల్లో పోలిస్ అంటే కనిపించని నాలుగో సింహం అనేది ఒక్కప్పుడు...ఇప్పడు మూవి లో పోలిస్ అంటే బాక్సాఫీస్ ను కాసులతో బంధించే ఖాకి సింహం..పోలిస్ ఫార్ములా తో ఈ హీరో ఆ హీరో అనే తేడా లేకుండా ప్రతి హీరో ప్రయత్నిస్తున్నాడు...సక్సెస్ ని టేస్ట్ చేస్తున్నారు... పవర్ ఫుల్ పోలీస్ పాత్రల్లో నటించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్నారు. పోలీస్ రోల్స్ అంటే ఇప్పుడు కెరీర్ టర్నింగ్ క్యారక్టర్స్...అప్పుడు తరం హీరోస్ పోలీస్ పాత్రల్లో నటిస్తే ఇప్పటి హీరోస్ పోలిస్ రోల్స్ లో జీవిస్తున్నారు...ఎంతగా అంటే కండలు పెంచి సినిమా పోలిస్ అంటే ఈ రేంజ్ లో వుండాలి అనిపించేంతగా.. ముఖ్యంగా పోలీస్‌ క్యారెక్టర్‌తోనే కెరీర్‌ టర్న్ అయిన హీరో సాయికుమార్‌.. అప్పటి వరకు సపోర్టెడ్ ఆర్టిస్ట్‌ గా,డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా మాత్రమే ఉన్న సాయికుమార్‌ పోలీస్‌స్టోరి సినిమాతో ఒక్కసారి స్టార్‌హీరోల సరసన చేరిపోయాడు.. అప్పటి వరకు ఉన్న పోలీస్‌ క్యారెక్టర్‌లకు భిన్నంగా హై ఎనర్టీజిటిక్‌ అండ్‌ ఎమోషనల్‌ పర్ఫామెన్స్‌ తో చేసిన సాయికుమార్‌ యాక్టింగ్‌తో పాటు మూడు సింహాలకు సంభందించి సాయికుమార్‌ చెప్పిన డైలాగ్‌ చిరస్ధాయిగా నిలిచిపోయింది.. పోలీస్‌ క్యారెక్టర్‌లకు ఎమోషన్‌ యాడ్‌చేసిన తొలి హీరో రాజశేఖర్‌.. అంకుశం సినిమాలో రాజశేఖర్‌ ఆ వేషానికి రూపంలా కనిపిస్తునే సిన్సియారిటీకి పర్ఫెక్ట్‌ ఎగ్జామ్‌పుల్‌ అనిపిస్తుంది.. అందుకే ఆ తరువాత కూడా రాజశేఖర్‌ చాలా సినిమాల్లో పోలీస్‌క్యారెక్టర్లతో మెప్పించాడు.. యన్టీఆర్ నుంచి చిరంజీవి దాకా పోలిస్ రోల్స్ లో అదరకొట్టిన వాళ్లే కాని అప్పుడు అంతగా ఫేమ్ అవ్వని పోలిస్ రోల్స్ పోకిరి తో హాట్ రోల్స్ గా మారిపోయ్యాయి...గబ్బర్ సింగ్ తో ఈ రోల్స్ హవా మరికొంచం పెరిగింది.. చిరంజీవి లాంటి మాస్‌మెగాస్టార్‌కు పోలీస్‌క్యారెక్టర్ల మీద తన ఇష్టాన్ని చూపించాడు.. ఎస్‌పి పరుశురాం, ముగ్గురు మొనగాళ్లు లాంటి సినిమాల్లో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించిన చిరు డిపార్టెమెంట్‌ గౌరవాన్ని మరింత పెంచాడు.. విక్టరీని కేరాప్‌ అడ్రస్‌గా మార్చుకున్న వెంకటేష్‌ కూడా పోలీస్‌ పాత్రల్లో నటించాడు.. సూపర్‌పోలీస్‌ సినిమాలో కామెడీ టచ్ ఉన్న పోలీస్‌ పాత్రలో నటించిన వెంకీ.. ఘర్షణ సినిమాలో సిన్సియర్‌ అండ్‌ సీరీయస్‌ పోలీస్‌గా మెప్పించాడు.. ఆ జనరేషన్‌లోనే మరో హీరో బాలకృష్ణ హై ఎనర్టీజిటిక్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా మెమరబుల్‌ మూవీస్‌ చేశాడు.. కెరీర్‌ పీక్‌స్టేజ్‌లో ఉన్న సమయంలో రౌడీ ఇన్స్‌పెక్టర్‌గా మెప్పిచిన బాలయ్య.. తరువాత వరుస ఫ్లాప్‌ల నుంచి తప్పించుకోవాడనికి కూడా మరోసారి యూనిఫాం వేసుకున్నాడు.. జయంత్‌సి పరాన్జీ డైరెక్షన్‌తో తెరకెక్కిన లక్ష్మీ నరసింహా సినిమాలో మరో సారి పోలీస్‌ఆఫీసర్‌గా నటించిన బాలయ్యబాబు పవర్‌ఫుల్‌ పోలీస్‌గా మెప్పించాడు. మన్మధుడు నాగార్జున కూడా పోలీస్‌క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నాడు.. నాక్కొంచం మెంటల్‌ అంటూ శివమణి సినిమాలో నటించిన నాగ్‌.. పవర్‌ఫుల్‌ పోలీస్‌ను సిన్సియర్‌ లవర్‌ని ఒకే ఫ్రేమ్‌లో చూపించాడు.. డైరెక్ట్ తెలుగు హీరో కాకపోయినా హీరో సూర్య కూడా పోలీస్‌ ఆఫీసర్‌గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. యముడు సినిమాతో సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ ఎలా ఉండాలో చూపించిన సూర్య ఇప్పుడు రీసెంట్ గా సింగంలా వచ్చి అలరించాడు. కొందరు హీరోస్ నిలదొక్కుకున్న తరువాత పోలిస్ పాత్రలను ఇష్టపడితే కొందరు మాత్రం హీరో గా నిలబడటానికే పోలిస్ కేరక్టర్స్ ను సెలెక్ట్ చేసుకున్నారు.. ఎలాగైతేనే టాలీవుడ్‌లో స్టార్‌స్టేటస్‌అందుకున్న హీరోలందరూ ఎప్పుడో ఒకసారి యూనీఫాం వేసుకున్నవారే.. సూపర్ స్టార్ వారసునిగా హై ఎక్స్ పెక్టేషన్స్ మధ్య టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రిన్స్ మహేష్ కూడా ఆ రేంజ్ ను అందుకోవటానికి యూనీఫాంనే నమ్ముకున్నాడు.. సూపర్ హిట్స్ సాదించటంలో తడబడుతున్న మహేష్ పోకిరి సినిమాలో పోలీస్ యూనిఫాంతో టాలీవుడ్ రికార్డులనే తిరగరాశాడు.. అప్పటి వరకు రాకుమారిడిగా చూసిన మహేష్ ఒక్కసారిగా సిన్సియర్ ఆపీసర్ గా మారటంతో సూపర్ స్టార్ ట్యాగ్ ఇచ్చేశారు టాలీవుడ్ ఆడియన్స్.. మహేష్ మాత్రమే కాదు మరో హీరో పవన్ కళ్యాణ్ కూడా తన ఫేట్ మారడానికి పోలీస్ క్యారెక్టర్ నే సెలక్ట్ చేసుకున్నాడు. పన్నేండేల్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న పవన్ గబ్బర్ సింగ్ సినిమాతో చరిత్రను తిరగరాసే హిట్ సాదించాడు.. పోలీస్ క్యారెక్టర్ అంటే ఇలానే ఉండాలనే బ్యారియర్స్ ను చేడిపేస్తూ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ చేసిన క్యారెక్టర్ అభిమానుల నీరాజనాలు అందుకోవటమే కాదు.. నిర్మాతకు కాసుల పంట పండించింది.. మరో యంగ్ హీరో ఎన్టీఆర్ కూడా డిపార్టెంట్ వ్యక్తిగా అలరించాడు.. అదుర్స్ సినిమాలో డిపార్ట్మెంట్ కోసం పనిచేస్తున్నట్టుగా కనిపించిన ఎన్టీఆర్ శక్తి సినిమాలో స్పెషల్ ఆఫీసర్ గా మెప్పించాడు..తరువాత బాద్షా సినిమాలో ఎపి పోలీస్ గెటప్ లో కనిపించిన ఎన్టీఆర్.. అభిమానుల నీరాజనాలు అందుకున్నాడు.. మరో హీరో రవితేజ కూడా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మెప్పించాడు.. విక్రమార్కుడు సినిమాతో విక్రమ్ సింగ్ రాథోడ్ గా నటించిన రవితేజ . ఖాకీ డ్రస్ పవర్ ఏంటో చూపించాడు.. ఇక మరళ వీరు పోలీస్ డ్రెస్ వేసేందుకు రెడీ అయ్యారు. మహేష్ శ్రీను వైట్ల తో చేస్తున్న ఆగడు సినిమాలో మరోసారి పోలీస్ క్యారక్టర్ చేయనున్నాడు. ఇక మాస్ మహరాజ్ రవితేజ కూడా ప్రస్తుతం చేస్తున్న పవర్ సినిమాలో పోలీస్ పాత్రను చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ రవితేజ అభిమానులను అలరిస్తుంది. సో ఈ విధంగా మన హీరోలు పోలీస్ అంటే వీడేరా అని అనిపించుకుంటున్నారు. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలు చేసిన హీరోలకు హ్యాట్సాఫ్ చెబుతుంది ఎపిహెరాల్డ్.కామ్ ఇప్పటివరకు పోలీస్ గా నటించిన హీరోలలో మీకు నచ్చిన హీరో ఎవరు..?సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ పై మీ స్పందన ఏమిటి..?

మరింత సమాచారం తెలుసుకోండి: