పూర్వ కాలపు మహారాజులులా దక్షణాది సూపర్ స్టార్ రజినీకాంత్ తన స్నేహితులతో బెంగుళూరు లో మారు వేషాలలో తిరుగుదామన్న రజినీ ప్రయత్నాన్ని బెంగుళూరు ప్రజలు పసి కట్టడంతో రజినీ సామాన్య ప్రజలులా సరదాగా రోడ్డు పై తిరుగు డామన్న కోరికకు ఆదిలోనే అడ్డంకు ఏర్పడింది. మీ అభిమాన ఎపిహెరాల్డ్ కు తెలిసిన సమాచారం ప్రకారం రజినీ తన చిన్నచిన్న కోర్కెలు తీర్చుకుందామని బెంగుళూరులో తన స్నేహితులతో మారు వేషాలలో తిరుగుతూ తనకు నచ్చిన టీస్టాల్ లో రోడ్డు పక్కన టీ తాగుతూ తన చిన్ననాటి స్నేహితులతో గడపాలని, తన చిన్నప్పుడు బెంగుళూరులో తాను తిరిగిన ప్రదేశాలన్నిటినీ కలియ తిరిగాలనే కోరిక కలగడంతో తన సినిమాల్లోలాగా మారువేషం వేసుకుని తన స్నేహితుడు ఉంటున్న రేస్ కోర్సు రోడ్డులోని గోల్ఫ్ వ్యూ అపార్ట్ మెంట్ లో విడిది చేశాడట మన రజిని. అంతేకాదు బెంగుళూరంతా తన చిన్ననాటి స్నేహితులతో కలిసి చుట్టేశాడు మన సూపర్ స్టార్ ఇలా నాలుగు రోజులు సరదాగానే గడిచిపోయాయి. అయితే నిజం ఎన్నటికి దాగదన్నట్టు నిన్న గురువారం ఈ విషయాన్ని ఒక వ్యక్తి పసిగట్టేశాడు. అతడు మరెవ్వరో కాదు రజనీ వీరాభిమానట. ఏ వేషంలో రజినీ వున్నా ఇట్టే పట్టేస్తాడట. దీంతో రజనీకాంత్ ఆ అభిమానికి అడ్డంగా దొరికిపోయాడు. ఇంకేముంది అతడితో పాటు కొన్ని వేలమంది అక్కడకు వచ్చేశారు. జై రజనీకాంత్...జై జై రజనీకాంత్ అంటూ నినాదాలుతో ఆ ప్రదేశం మారుమోగిపోయింది. తర్వాత విషయం తెలుసుకున్న వారుకూడా సాధారణ అభిమానుల్లో కలిసిపోయి రజనీకాంత్ ను చూసేందుకు ఎగబడ్డారట.  చివరకు రజనీకాంత్ బయటకు వచ్చి అభివాదం చేయటంతో ఒక్కసారిగా నినాదాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా రజనీకాంత్ తో ఫోటోలు తీయించుకునేందుకు పోటీ పడ్డారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని అభిమానులను అదుపు చేయాల్సి వచ్చింది అని వార్తలు వస్తున్నాయి. ఎదిఎమైనా రజినీ తన పాత స్నేహితులతో సరదాగా గడుపుదామనుకున్న ప్రయోగానికి ఆటంకం ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: