ప్రిన్స్ మ‌హేష్‌బాబు, ప్రస్తుతం మూవీల స్పీడు పెంచుకుంటూ వెళుతున్నాడు. అంతే కాకుండా త‌ను ఒప్పుకుంటున్న మూవీలు కూడ ఎంతో వైవిధ్యమైన‌విగానూ, ఎంట‌ర్‌టైన్మెంట్ క‌లిగి ఉన్నవి గానూ ఉంటున్నాయి. దీంతో మ‌హేష్‌బాబు మూవీలు అంటే టాలీవుడ్‌లో ఇండ‌స్ట్రీలో కంటెంట్ ఉన్న మూవీగా ట్రేడ్ మార్క్ వేస్తున్నారు. ఇదిలా ఉంటే పూరీజ‌గ‌న్నాధ్‌కు మ‌హేష్‌బాబు గుడ్ న్యూస్ చెప్పాడు. చెప్పడ‌మే కాకుండా త్వర‌లో ఆ రిజ‌ల్ట్ క‌న‌ప‌డుతుంది అని హామి కూడ ఇచ్చాడంట‌. పూరిజ‌గ‌న్నాధ్ ఆఫీస్ నుండి ఎపిహెరాల్డ్‌.కామ్‌కి అందిన స‌మాచారం ప్రకారం ప్రిన్స్ మ‌హేష్‌బాబు, క్రేజీ డైరెక్టర్ పూరీజ‌గ‌న్నాధ్ కాంబినేష‌న్‌లో ఓ మూవీ సిద్ధం అవుతుంది. పోకిరి మూవీకు సీక్వెల్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతుంది. టాలీవుడ్‌లో పోకిరి మూవీ క్రియోట్ చేసిన రికార్డ్‌లు అంతా ఇంతా కాదు. మ‌హేష్‌బాబు న‌టించిన బ్లాక్‌బ‌స్టర్ మూవీల‌లో పోకిరి ఒక మూవీగా ఉంటుంది. అయితే ఈ మూవీ మాత్రం 2015 చివ‌ర‌ల్లో ఉంటుందని ప్రొడ‌క్షన్ నుండి అందిన న్యూస్‌. ప్రస్తుతం మ‌హేష్‌బాబు, యుటివి మోష‌న్స్ ఫిక్చర్స్‌లో నిర్మితమ‌వుతున్న మూవీ కోసం రెడీ అవుతున్నాడు. ఈ మూవీను డైరెక్టర్ కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇంకా రావ‌ల్సి ఉంది. ఈలోపే పూరిజ‌గ‌న్నాధ్ మూవీకు ప్రిన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. మ‌హేష్‌బాబు, పూరిజ‌గన్నాద్ కాంబినేష‌న్‌లో వ‌చ్చే మూవీ పోకిరి2 అవుతుందా? లేక మ‌రో కొత్త స్టోరి అవుతుందా? ఈ ప్రశ్నల‌పై మీ అభిప్రాయాల‌ను తెలియ‌ప‌ర‌చండి.

మరింత సమాచారం తెలుసుకోండి: