ఒక్క టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ మాత్రమే కాకుండా యావ‌త్ సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ సైతం మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూస్తున్నారు. సినీ ఇండ‌స్ట్రీలో చిరుకి ఇప్పటికీ అంత క్రేజ్ ఉంది. రాజ‌కీయాల్లో అనుకున్నది సాధించుకోవ‌డం కొద్దిగా ఆల‌స్యం జ‌రుగుతున్నా, ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మాత్రం త‌ను ఎప్పటికీ నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌లోనే ఉంటాడు. ఇది రీసెంట్‌గా ఓ జాతీయ దిన‌ప‌త్రిన తెలిపిన స‌ర్వే రిపోర్ట్‌. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి 150వ మూవీకు రంగం సిద్ధం అయ్యింద‌నే చెప్పాలి. ఈ మూవీను చిరంజీవి త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ స్వయంగా నిర్మాణ బాధ్యత‌ల‌ను స్వీక‌రిస్తున్నాడు. రామ్‌చ‌ర‌ణ్ వ‌ద్ద ఉన్న మూడు స్టోరిలో రెండు స్టోరిలు వినాయ‌క్‌వి. మ‌రో స్టోరి దిల్‌రాజుది అని టాలీవుడ్‌లో టాక్స్ వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నిక‌ల అనంత‌రం ఈ మూవీకు సంబంధించిన షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుందని టాలీవుడ్ నుండి అందిన స‌మాచారం. అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా, బాలీవుడ్ బ‌బ్లీ బ్యూటి ప‌రిణితి చోప్రాను తీసుకోవాల‌ని, ఆమెను అడిగిరాంట‌. తెలుగులో నేను ఏ మూవీలో న‌టించ‌ను, మెగాస్టార్ మూవీలో న‌టించ‌టానికి కాల్షీట్స్ కాలీగా లేదు అన్నదంట‌. అయితే చిరు 150వ‌ మూవీకు అంతా ఓకె అయిన‌ప్పటికి హీరోయిన్‌ను ఎవ్వరు తీసుకోవాలి అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. హీరోయిన్స్ దొర‌కంటం కొద్దిగా క‌ష్టంగా ఉంది అని చిరుతో స‌న్నిహిత వ్యక్తి స‌ర‌దాగా కామెంట్ చేసినా, చిరు మాత్రం కొద్దిగా సీరియ‌స్ అయ్యి క్లాస్ పీకాడంట‌. ఈ విష‌యం తెలిసిన అంద‌రూ చిరు క్లాస్ పీకంటం క‌రెక్టే మ‌రి, మెగాస్టార్ స‌ర‌స‌న హీరోయిన్స్ దొర‌కరు అంటే అది విడ్డూర‌మే క‌దా అని అంటున్నారు. చిరంజీవి 150వ చిత్రంలో హీరోయిన్‌గా ఎవ‌రిని తీసుకుంటే మంచిది? కొత్త హీరోయిన్ అయితే మూవీకు ప్లస్సా? మైనస్సా? ఈ టాపిక్స్‌పై మీ స‌మాధానాల‌ను ఇక్కడ తెలియ‌ప‌ర‌చండి.

మరింత సమాచారం తెలుసుకోండి: