బాలీవుడ్లో మళ్లీ సినిమాల సందడి మొదలైంది.. ఇక నుంచి ఎవ్రీ వీక్ కనీసం రెండ సినిమాలు రిలీజవుతున్నాయి..ఈనెల్లోనే ఏడు భారీ సినిమాలు రిలీజ్ కి క్యూ లో ఉన్నాయి... ఫిబ్రవరి అంతా పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడబోతున్నాయి.. మరి ఈనెల్లో రిలీజయ్యే ఆ బిగ్ మూవీస్ డీటెయిల్స్.. బాలీవుడ్లో బిగ్ సినిమా సందడి మొదలౌతోంది..జనవరిలో దేడ్ ఇష్కియా జయహో తప్ప చెప్పుకోదగ్గ సినిమాలే రాలేదు..వచ్చిన ఆ సినిమాలు కూడా ఆడియెన్స్ ను ఆకట్టుకోవడంలో ఫెయిలయ్యాయి..దీంతో సినిమా సీజన్ డల్ గా స్టార్ట్ అయినా ఫిబ్రవరి మాత్రం సినీ ప్రేక్షకులకు కనువిందు చేయబోతోంది.. భారీ సినిమాలు రిలీజ్ కి క్యూ లో ఉన్నాయి ప్రతి వారం ఓ బిగ్ మూవీ రిలీజవుతోంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో సిద్దార్త్ మల్హోత్రా సెకండ్ మూవీ హసీ తో ఫసీ. సిద్దార్త్ పరిణితీ చోప్రా జోడీగా కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో వినీల్ మ్యాధ్యూ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇప్పటికే బాలీవుడ్ లో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది..ఫిబ్రవరి 7 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఇక ఇదే రోజు రిలీజవుతోంది శేఖర్ సుమన్ తనయుడు అధ్యాయన్ సుమన్ డెబ్యూ మూవీ హార్ట్ లెస్ .అధ్యాయన్ సుమన్ ,అరియాన లీడ్ రోల్స్ లో శేఖర్ సుమన్ డైరెక్ట్ చేసిన ఈ మెడికో థ్రిల్లర్ ట్రైలర్ తోనే ఆడియెన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది..ఓం పురి,దీప్తి నావల్ కీ రోల్స్ చేయడంతో ఈ మూవీపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.. ఇక ఫిబ్రవరిలో రిలీజయ్యే బిగ్ మూవీ గుండే.. రామ్ లీలా తో సూపర్ హిట్ కొట్టి బిగ్ లీగ్ హీరోల లిస్ట్ లో చేరిన రణ్ వీర్ సింగ్ ,అర్జున్ కపూర్ హీరోలుగా ప్రెస్టీజియస్ యశ్ రాజ్ బ్యానర్లో అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేసిన గుండే ఫస్ట్ లుక్ నుంచే అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది..బాలీవుడ్ న్యూ జై . వీరు లుగా రణ్ వీర్ సింగ్ అర్జున్ కపూర్ కాంబినేషన్ తో పాటు ప్రియాంక క్యాబరే డాన్సర్ గా నటిస్తుండడంతో ఈ మూవీ పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి..ఫిబ్రవరి-14 న గుండే ప్రేక్షకుల ముందు కు వస్తోంది. ఇక స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అలియా భట్ లీడ్ రోల్ లో వస్తోన్న లేటెస్ట్ మూవీ హైవే యూటీవీ,సాజిద్ నడియాడ్ వాలా జాయింట్ వెంచర్లో ఇంతియాజ్ అలీ తెరెకెక్కంచిన జర్నీ బేస్డ్ మూవీ గా హైవే బాలీవుడ్లోఅందరి అటెన్షన్ గ్రాబ్ చేసింది.. ఆస్కార్ విన్నర్ రెహమాన్ అందించిన ఢిఫరెంట్ ట్యూన్స్ అందరినీ ఆకట్టుకుంటుండడంతో హైవే కి మంచి క్రేజ్ వచ్చింది..ఫిబ్రవరి 21 న ఈ మూవీ థియేటర్లలోకి వస్తోంది.. ఇక ఈ నెల లాస్ట్ వీక్ బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు విద్యాబాలన్,కంగనా రనౌత్.. బాలీవుడ్ ఫిమేల్ ఫర్పెక్షనిస్ట్ విద్యాబాలన్,వెరీ టాలెంటెడ్ మిల్కా పర్హాన్ అక్తర్ కాంబినేషన్లో సాకేత్ చౌదురీ డైరెక్ట్ చేసిన మూవీ షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ ..ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్ సీక్వెల్ గా వస్తోన్న ఈ మూవీ ట్రైలర్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది..రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 28 న థియేటర్లలోకి రాబోతోంది. ఇక ఫ్యాషన్ బ్యూటీ కంగనా రనౌత్ విద్యా బాలన్ తో ఢీ అంటోంది..కంగనా రనౌత్,రాజ్ కుమార్ రావ్ లీడ్ రోల్ లో వస్తోన్న లేటెస్ట్ మూవీ క్వీన్ ..వికాస్ బెహల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కంగనా తో పాటు లిసా హెడెన్ ఇంపార్టెంట్ రోల్ చేసింది.. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ప్రోమోస్ కి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.. ఫిబ్రవరి 28 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. మరి ఈబిగ్ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొడ్తాయో లెట్స్ వెయిట్ అండ్ వాచ్… రాబోయే బాలీవుడ్ సినిమా పండుగలపై మీ స్పందన..?

మరింత సమాచారం తెలుసుకోండి: