ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఓ స్థాయి స్టార్‌డం వ‌స్తే చాలు, ఏం మాట్లాడినా చెల్లుతుంది అనే ధోర‌ణిలో ఉంటారు. ముఖ్యంగా ఈ త‌ర‌హా క‌ల్ఛర్ బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో చూస్తుంటాము. కాలేజ్‌లో రాగింగ్ ఎలా ఉంటుందో బాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనూ చిన్న స్లార్లు, పెద్ద స్టార్లు అనే తేడా లేకుండా రాగింగ్ చేసుకుంటారు. ఈ విధంగా వీరంద‌రూ చేస్తుంటే, వీళ్ళను చూసి బిటౌన్ ఆడియ‌న్స్ అంతా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే రీసెంట్‌గా బిటౌన్ టాప్ హీరోయిన్ పై ఓ హీరోయిన్ కామెంట్ చేసింది. ఓ ప్రవేట్ ఫంక్షన్‌కు అటెండ్ అయిన క్రేజీ హీరోయిన్ ప‌రిణితిచోప్ర, టాప్ హీరోయిన్ సోనాక్షిసిన్హా మీద కామెంట్ చేసింది. సోనాక్షి సిన్హా ఏ మూవీలో చూసిన బొద్దుగా ఉంటూ, బ‌రువు ఉన్నా లేన‌ట్టుగా క‌నిపిస్తుంది. అంద‌రి హీరోయ‌న్స్ జీరో సైజ్‌, స్లిమ్ ఫిట్ అంటూ డైట్‌ను కంట్రోల్ చేస‌కుంటుంటే, సోనాక్షి సిన్హా మాత్రం అలాంటివేమి ప‌ట్టన‌ట్టు ఇష్టం వ‌చ్చిన‌ట్టు తిని, త‌న బ‌రువును మాత్రం త‌గ్గించుకోకుండా చూసుకుంటుంది. అయితే ఈ త‌ర‌హాలోనే ప‌రిణితిచోప్ర కూడ ఉంటుంది. ప‌రిణితి చోప్రను ఆ ఫంక్షన్‌లో మీడియా ఓ ప్రశ్నను అడిగింది. మీరు బ‌రువు త‌గ్గిదే బాగుంటుంది క‌దా అని అన్నారు. దీనికి ప‌రిణితిచోప్ర స‌మాధానం చెబుతూ 'నేను సోనాక్షి సిన్హా కంటే ఏ మాత్రం బ‌రువు లేను. నేను హ్యీపీ' అని అంది. దీంతో సోనాక్షిను కామెంట్ చేయ‌ట‌మే కాకుండా, ప‌బ్లిక్‌లో ఈ విధంగా మ‌ట్లాడ‌టంపై సోనాక్షి బాగా సీరియ‌స్‌గా ఉంద‌ట‌. త‌న‌కూ ఛాన్స్ వ‌స్తుంది అప్పుడు చూద్దాంలే అని సోనాక్షి త‌న స‌న్నిహితుల‌తో చెప్పింద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: