బాలీవుడ్ బాక్సాఫీస్ టైగర్ సల్మాన్ రూట్ మారుస్తున్నాడు.. యాక్షన్ మూవీస్ తో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన దభాంగ్ ఖాన్ జయహో షాక్ తో ఇప్పుడు యాక్షన్ మోడ్ నుంచి ఫ్యామిలీ మోడ్ కి షిప్ట్ అవుతున్నాడు.. సల్మాన్ ఖాన్..ప్రెజెంట్ బాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరో..వాంటెడ్ ,దభాంగ్ ,రెడీ,బాడీగార్డ్,ఏక్ థా టైగర్,దభాంగ్-2 వంటి వరుస హిట్లతో బాలీవుడ్ లో సల్మాన్ రేంజే మారిపోయింది..సూపర్ హిట్ 100 క్రోర్స్ క్లబ్ కి సల్మాన్ ఐకాన్ గా మారిపోయాడు. సక్సెల పరంగా బాలీవుడ్లో నెం1 స్టేటస్ ఎంజాయ్ చేస్తోన్న దభాంగ్ ఖాన్ కి జయహో తో షాకిచ్చారు ఆడియెన్స్. వన్ ఇయర్ లాంగ్ గ్యాప్ తర్వాత వస్తోన్న సల్మాన్ మూవీ కావడంతో ప్రీ రిలీజ్ జయహో పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.. ఇంకేముంది జయహో తో సల్మాన్ అమీర్ ఖాన్ ధూమ్-3 తో పాటు బాలీవుడ్ రికార్డ్స్ అన్నింటినీ స్మాష్ చేస్తాడని ఓ రేంజ్ లో ప్రచారం జరిగింది.. కానీ జయహో ప్రేక్షకుల ముందుకు వచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యింది..రొటీన్ యాక్షన్ డ్రామా గా ఉండడంతో జయహో ని ఆడియెన్స్ ఫస్ట్ డే నే రిజెక్ట్ చేశారు. రీసెంట్ టైమ్స్ లో సల్మాన్ మూవీ కి ఇంత తక్కువ కలెక్షన్స్ రావడం ఇదే ఫస్ట్ టైమ్.. దీంతో కళ్లు తెరిచిన సల్మాన్ ఇక రూట్ మార్చాలని ఫిక్సయ్యాడు.. ఇప్పుడు యాక్షన్ మోడ్ నుంచి ఫ్యామిలీ మోడ్ కి షిప్టవుతున్నాడు..ప్రస్తుతం సల్మాన్ కిక్ తో పాటు సూరజ్ బర్జాత్యా సినిమాకి గ్రీన్ సిగ్నలిచ్చాడు.. సాజిద్ ఖాన్ డైరెక్ట్ చేస్తోన్న కిక్ లో యాక్షన్ తో పాటు అన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.. ఇక సూరజ్ బార్జాత్యా డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ..మైనే ప్యార్ కియా,హమ్ ఆప్ కే హై కౌన్ ,హమ్ సాత్ సాత్ హై తర్వాత సూరజ్ సల్మాన్ ల కాంబినేషన్లో వస్తోన్న మూవీ కావడంతో ఈ మూవీపై ఆడియెన్స్ లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి..దీంతో ఈ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని షూటింగ్ కి ముందే స్క్రిప్ట్ పై పూర్తి శ్రద్ద తీసుకుంటున్నాడు. ఇకపై మాస్ మసాలా సినిమాలకి కాలం చెల్లినట్టేనని..ఆడియెన్స్ రోటీన్ సినిమాలతో విసిగిపోయారని కొత్తదనం లేకపోతే ప్రేక్షకుల థియేటర్లకు రప్పిచడం కష్టమేనంటున్నాడీ కండల వీరుడు.. మరి తన రాబోయే సినిమాల్లో సల్మాన్ ఏ రేంజ్ లో ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేస్తాడో లెట్స్ వెయిట్ అండ్ వాచ్.. నిజంగా సల్మాన్ రూటు మార్చేస్తాడా..?సల్మాన్ ఖాన్ డెశిషన్ కరెక్టేనా..?

మరింత సమాచారం తెలుసుకోండి: