కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పాండవులు పాండవులు తుమ్మెద సినిమా మీద భారీగానే హోప్స్ పెట్టుకున్నాడని అందరికి తెలిసిందే. కొద్ది కాలంగా ఫుల్ లెంగ్త్ పాత్రలకు దూరంగా ఉన్న మోహన్ బాబు ఈ సినిమాలో తన ఇద్దరి కొడుకులతో సమానంగా స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇకపోతే ఈరోజే రిలీజ్ అయిన ఈ సినిమా మంచి రివ్యూస్ వస్తున్నాయి. మౌత్ టాక్ కూడా పాజిటివ్ గా రావడంతో మోహన్ బాబు ఫుల్ హ్యాపీ అట. అసలు మంచు ఫ్యామిలీ అంతా కలిసి సినిమా తీయాలనే ఆలోచన ఎందుకు కలిగినట్లు అని అందరు డౌట్స్ వెళ్లగక్కారు. ఒకవేళ సినిమా అటు ఇటు అయితే అనవసరంగా ఫ్యామిలీ అంతా మాటలు పడాల్సి వచ్చేది. కానీ ఈ ప్రాజెక్ట్ అంతటికి ముందుండి నడిపించాడు కలెక్షన్ కింగ్. ఈరోజు రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సాధించిన ఈ పాడవులు ఆడియెన్స్ ని థియేటర్స్ కి రాపించే కామెడి మంత్రాన్నే నమ్ముకున్నారు. సినిమా మొదటి ఆటే మంచి టాక్ వచ్చింది కాబట్టి సినిమా మంచి హిట్ అవుతుందని అంచనా వేస్తున్నాయి సినీ వర్గాలు. ఫ్యామిలీ అంతా కలిసి నటించి నిర్మించిన ఈ సినిమా హిట్ కొట్టి మోహన్ బాబు గెలిచారనే చెప్పాలి. ఆడియెన్స్ ఎలాంటి సినిమాలైతే ఆదరిస్తారో.. ఎలాంటి సినిమాలకు రిపీట్ ఆడియెన్స్ వస్తారో.. ఎలాంటి సినిమాలు ఫ్యామిలీ మొత్తం చూడడానికి ఇష్టపడతారో ఆ సినిమాలను తీస్తూ వరుసెంట విజయాలను సాధిస్తున్న మంచు ఫ్యామిలీకి ఈ సినిమా హిట్ మంచి కిక్ ని ఇస్తుంది. సో ఫుల్ పాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైన్ గా మనముదుకొచ్చిన పాండవులు పాండవులు తుమ్మెద సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటుంది ఎపిహెరాల్డ్.కామ్.. మంచు ఫ్యామిలీ సినిమాపై మీ స్పందన..?

మరింత సమాచారం తెలుసుకోండి: