అపుర్వాలఖియా దర్శకుడిగా పరాజయం సాధించినా క్రికెటర్ గా మరో అవతారం ఎత్తి నిన్న ఆయన సృస్టించిన పరుగుల తుఫాన్ మాత్రం సూపర్‌హిట్టయింది. సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ (సీసీఎల్‌-4)లో భాగంగా శనివారం దుబాయ్‌లో ముంబై హీరోస్‌, తెలుగు వారియర్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ సాగింది. ముంబై జట్టు 37 పరుగులకు 7 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి అడుగుపెట్టాడు అపూర్వ లఖియా.  జట్టు 50 పరుగులు కూడా చేస్తుందో లేదో అనుకొంటున్న దశలో మైదానంలో పరుగుల తుఫాన్‌ సృష్టించాడు. కేవలం 30 బంతుల్లోనే 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఆయన ఆట మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. అపూర్వకి ఇంద్రనీల్‌ చక్కటి సహకారం అందించారు. ఆయన 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఈ ఇద్దరి భాగస్వామ్యంతో ముంబయి జట్టు 127 పరుగుల స్కోరు సాధించింది. అపూర్వ ఆటలో మూడు బౌండరీలతో పాటు, ఆరు సిక్సర్లు ఉండటం విశేషం. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధించి విజయం అందుకొంది తెలుగు జట్టు. ప్రిన్స్‌, సుధీర్‌బాబు, సచిన్‌ జోషి, అఖిల్‌, ఆదర్శ్‌ తదితర తారలు బ్యాట్‌తో మెరుపులు మెరిపించారు. రఘు, నందకిషోర్‌ బాల్‌తో మేజిక్‌ చేశారు. దీంతో ఆరు వికెట్ల తేడాతో ఇంకా రెండు ఓవర్లు మిగిలివుండగానే తెలుగు వారియర్స్‌ జట్టు విజయ పతాకం ఎగరేసింది. ఈసారి కప్పు గెలవడమే తమ లక్ష్యమని చెప్పే దిశలో వెంకటేష్ అక్కినేని అఖిల్ నేతృత్వంలోని తెలుగు వారియర్స్ మరోసారి తమ సత్తాను చూపెడుతూ ఈ టోర్నమెంట్ లో మూడడుగు వేయడం తెలుగు సినిమా పరిశ్రమకు తెలుగు సినిమా అభిమానులకు స్వీట్ మేమరీగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: