తెలుగులో ‘వీరభద్ర’ చిత్రంలో బాలకృష్ణతో నటించిన తనుశ్రీదత్తాకు బాలీవుడ్‌లో శృంగార నాయికగా గుర్తింపు వచ్చింది. ఓ పక్క హీరోయిన్‌గా తన సత్తా చాటుకుంటూనే అప్పుడప్పుడు చేసిన శృంగారాభినయంతో ఆమెకు స్టార్‌డమ్ వచ్చి పడింది. ఇష్టంలేని స్టార్‌డమ్ మోయటం కష్టమేనని, తనుశ్రీ మరోసారి రుజువు చేస్తోంది. ఈ విషయాన్ని వివరిస్తూ ప్రధానంగా తాను నటినని, అన్ని రకాల పాత్రలు చేయగలనని, అటువంటి నాపై కేవలం శృంగార తారగా, సెక్స్‌బాంబుగా ముద్రవేయడం సరికాదంటోంది. ఎందుకు ఇలా అంటుంది అంటే రీసెంట్‌గా త‌నూశ్రీ ద‌త్తా వ‌ద్దకు ఓ ప్రొడ్యూజ‌ర్ వ‌చ్చి, మీరు ఒప్పుకుంటే ఓ లేడి ఓరియంటెడ్ మూవీ సిద్ధంగా ఉంది. కాకాపోతే స్టోరి డిమాండ్ మేర‌కు న్యూస్ సీన్స్ నిడివి ఎక్కువుగా ఉంటుంది. అలాగే రిపీటెడ్‌గా వుంటుంది. చేస్తారా. రెమ్యున‌రేష‌న్ గురించి ఆలోచించ‌వ‌ద్దు అంటూ క్లారిటిగా చెప్పాడ‌ట‌. దీంతో ఒళ్ళు మండిన త‌నుశ్రీ ద‌త్తా, వెంట‌నే ప్రెస్ మీట్ పెట్టేసింది. త‌న గురించి ఏమ‌నుకుంటున్నారో అని ప్రొడ్యూజ‌ర్లకు క్లాస్ పీకింద‌ట‌. అందం, అభినయం రెండూ ఉండడం నా తప్పుకాదని, ఎలాంటి పాత్రనైనా చేయడానికి ముందుకు వస్తానని, అంతమాత్రాన ఓ ప్రత్యేకమైన ముద్ర నాపై వేయవద్దని కోరుకుంటోంది. అందం కాపాడుకోవడానికి మనస్సు ప్రశాంతంగా వుంచుకుంటూ, మంచి పుస్తకాలు చదువుతూ, యోగ, ధ్యానం వల్ల అందాన్ని కాపాడుకోవ‌చ్చు అని బ్యూటీ టిప్స్ కూడా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: