టాలీవుడ్ మార్కెట్ ఎలా వున్నా తెలుగు సినిమా బడ్జెట్ మాత్రం రేసుగుర్రంలా పరుగెడుతోంది. భాగస్వామ్య నిర్మాణాలు అధికమవ్వడంతో బడ్జెట్‌ని పెంచడానికి దర్శకులు ఉత్సాహం చూపుతున్నారు. ఓ పక్క కథ డిమాండ్ మేరకే అంటూనే మరో పక్క ఓవ‌ర్ ప్రొడ‌క్షన్ క్యాలిటీస్‌ను చూపెడుతున్నారు. టాలీవుడ్ అగ్రహీరో సినిమా అంటే నేడు రూ. 50కోట్లు పైమాటే. నిర్మాణ వ్యయంపై ఇరవై శాతం ప్రాఫిట్ వస్తేచాలు అనుకొని మూవీలు నిర్మిస్తున్నారు. దీంతో ఒక్కోసారి అంచనాలు తారుమారై నిర్మాతలు నిండామునిగిపోయిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. ఒక్కసారి చేతులు కాల్చుకున్న త‌రువాత కూడ నిర్మాత‌లు బుద్ధి తెచ్చు కోకుండా మ‌ళ్ళీ అదే ప‌ని చేస్తున్నారు. మితిమీరిన బ‌డ్జెట్ ఎవ‌రికి మంచిది అన్నదానిపై ఎపిహెరాల్డ్‌.కామ్‌ ప్రత్యేక క‌థానాన్ని ఇస్తుంది. యువ హీరోలు సినిమాలు రిచ్‌గా వుండాలని ఆరాటపడడంతో హిట్టూ ఫ్లాపులతో సంబంధంలేకుండా బడ్జెట్‌ని సిద్ధంచేసుకోవాల్సిన పరిస్థితి నిర్మాతల‌ది. ‘ఆరెంజ్’, ‘శక్తి’, ‘బద్రీనాథ్’, ఓం, ‘షాడో’ వంటి మూవీలు మేకింగ్‌లో రిచ్‌నెస్‌ను నింపుకున్నా ప్రేక్షకులను అలరించలేక నిర్మాతలు కోలుకోలేని దెబ్బతిన్నారు. ఈ విషయంలో తప్పొప్పులు ఎంచడం తప్పే అవుతుంది. ఎందుకంటే టాలీవుడ్ సినిమా నిర్మాణ వ్యయం విషయంలో 50 కోట్ల మార్కు దాటేసింది. మంచు ఫ్యామిలీ సినిమాలపై 60 కోట్లవరకు ఖర్చుచేస్తుంటే, రవితేజ, సునీల్, ప్రభాస్ సినిమాలపై 100 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. ఈమధ్య చిన్న సినిమాలు సంఖ్యాపరంగా పెరగడంతో టాలీవుడ్ టర్నోవర్ బాగా పెరుగుతుంది. మహేష్‌బాబు ఒక్కడే భారీ నిర్మాణ వ్యయంతో టాలీవుడ్‌ని ప్రభావితం చేస్తున్నాడు. ఓవర్‌సీస్ మార్కెట్‌ని విస్తరించుకోవడానికి హీరోలు కసరత్తులు చేస్తున్నారు. బాలీవుడ్ సినిమాలు బడ్జెట్ విషయంలో ఎప్పుడో 50 కోట్ల మార్కుని దాటేసాయి. ఇప్పుడు కలెక్షన్ల విషయంలో 100 కోట్ల క్లబ్‌ని 500 కోట్ల క్లబ్‌ని సృష్టిస్తున్నాయి. ఇటీవల ‘ధూమ్‌3’ 500 కోట్ల మార్క్‌ని దాటేసి సరికొత్త రికార్డుని సృష్టించింది. తెలుగు సినిమా కూడా 100 కోట్ల క్లబ్‌కి చేరుకుంది. దీనిని మరింతగా పెంచే దిశగా రాజవౌళి క్రేజీ ప్రాజెక్ట్ సిద్ధమౌతుంది. బడ్జెట్ కంట్రోల్ తప్పడంతో అగ్రహీరోల సినిమాలకు వారి బ్యానర్లే ఉపయోగపడుతున్నాయి. లేదంటే ఏదో పిచ్చిగా ఒప్పందాల‌ను కుదుర్చుకొని నిర్మాతలు రిపీట్ అవుతున్నారు. దూకుడు తీసిన 14 రీల్స్ బ్యానర్ నిర్మాతలే వరసగా మహేష్‌తో దూకుడు ‘వన్’, ఆగడు ప్లాన్‌చేయడం దీనికి నిదర్శనం. తక్కువ బడ్జెట్‌తో ఘన విజయం అందుకున్న దర్శకులు తర్వాత అమాంతంగా బడ్జెట్‌ని పెంచేస్తున్నారు. ఈ కేట‌గిరిలోకి ‘మారుతి’ సమర్పిస్తున్న సినిమాలు వస్తున్నాయి. నూతన పరిచయ తారాగణం సినిమాలపై కూడా 2కోట్లు పెడుతున్నారు. ఒకటి రెండు హిట్లు పడ్డ హీరోలపై 5 కోట్లు వరకు ఖర్చుచేస్తున్నారు. మొత్తానికి సినిమా నిర్మాణం కోట్ల వరకు దాటేసిందన్నది గ్రహించదగ్గ వాస్తవం. నిర్మాణ వ్యయంపై అదుపులేకపోతే దారుణ నష్టాలను చవిచూడాల్సి వస్తుందన్న సత్యం తెలిసినా వెనుకంజ వేయకపోవడానికి ప్రధాన కారణం భాగస్వామ్య నిర్మణమే. భాగస్వామ్య నిర్మాణంలో వరస నష్టాలు చవిచూస్తే పెట్టుబడులుపెట్టే సంస్థలు కూడా వెనుకడుగు వేయవచ్చు. ఆ తర్వాత రేంజ్ తగ్గించి సినిమాలు చేస్తామంటే హీరోలూ ఒప్పుకోకపోవచ్చు. హీరోల బ‌లుపును చూసి బ‌డ్జెట్ పెడితే, సీన్ రివ‌ర్స్ అయిందంటే నిర్మాత‌ల‌కు అది పెద్ద వాపుగా క‌నిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: