హార్ట్ఎటాక్ మూవీ జ‌న‌వ‌రి 31న రిలీజ్ అయి చెప్పుకోదగ్గ క‌లెక్షన్స్‌తో ముందుకు దూసుకుపోతుంది. అయితే కొన్ని ఏరియాల్లో మాత్రం ఈ మూవీకు ఆశించినంత క‌లెక్షన్స్ రాక‌పోవ‌డంతో న‌ష్టాల‌ను చ‌విచూడ‌క త‌ప్పడంలేదు. హార్ట్ఎటాక్ మూవీకు సంబంధించిన 3 రోజుల బాక్సాపీస్ రిపోర్ట్‌ను ఎపిహెరాల్డ్‌.కామ్ మీకు అందిస్తుంది. ప్రస్తుతం హార్ట్ఎటాక్ మూవీ రిలీజ్ అయిన అన్ని ధియోట‌ర్లల‌లో 60 శాతం ఆక్యుపెన్సీతో ఆడుతుంది. దీంతో మొద‌టి రోజు క‌లెక్షన్స్ కంటే కొద్దిగా త‌గ్గాయ‌ని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ మొద‌టి రోజు బాక్సాపీస్ 4.5 కోట్ల రూపాయ‌ల‌ను క‌లెక్ట్ చేసింది. నితిన్ ఫిల్మ్ కెరీర్‌లోనే ఇది అత్యంత ఎక్కువుగా సాధించిన క‌లెక్షన్స్‌గా సాధించింది. మొత్తంగా మూడు రోజుల హార్ట్ఎటాక్ మూవీ క‌లెక్షన్స్ 13.81 కోట్ల రూపాయ‌లుగా వసూల్ చేసింది. నితిన్ కెరీర్‌లో హార్ట్ఎటాక్ మూవీ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించిన మూవీగా ఉంటుంద‌ని ట్రేడ్ రిపోర్ట్‌.  హార్ట్ఎటాక్ మూవీ 3 రోజుల క‌లెక్షన్స్‌: హార్ట్ఎటాక్ మొద‌టి రోజు క‌లెక్షన్స్‌: 4.5 కోట్లు హార్ట్ఎటాక్ రెండ‌వ‌ రోజు క‌లెక్షన్స్‌: 4.80 కోట్లు హార్ట్ఎటాక్ మూడ‌వ‌ రో జు క‌లెక్షన్స్‌: 4.51 కోట్లు హార్ట్ఎటాక్ మూడు రోజుల‌ క‌లెక్షన్స్‌: 13.81 కోట్లు

మరింత సమాచారం తెలుసుకోండి: