నిన్న జ‌రిగిన త‌మిళ స్టార్ హీరో శింబు బ‌ర్త్‌డే వేడుక‌ల‌కు ఎన్నో ప్రత్యేక‌త‌లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పార్టీలో అంద‌రూ ఊహించిన దానికంటే విభిన్నంగా ఓ సెల‌బ్రిటి అటెండ్ అయ్యింది. దీంతో అంద‌రూ షాక్ అయ్యారు. అలాగే ఆ పార్టీలో జ‌రిగిన విశేషాలు, ఫొటోల రూపంలో బ‌య‌ట‌కు రావ‌డంతో, ఆ మేట‌ర్ అంతా కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో స్ప్రెడ్ అయ్యింది. ఆ ఎక్స్‌క్లూజివ్ న్యూస్‌ను ఎపిహెరాల్డ్‌.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. అయితే ఈ వార్తల‌పై మాత్రం ఆ హీరోయిన్ నుండి ఎంటువంటి రియాక్షన్ రావ‌డంలేదు. వెల్‌, మేట‌ర్ ఏంటంటే ఫిభ్రవ‌రి 3న శింభు పుట్టినరోజు వేడుక‌లు జ‌రిగాయి. 2వ తేధీ రాత్రి జ‌రిగిన కేక్ క‌టింగ్ వేడుక‌ల‌లో శింభుతో పాటు హ‌న్సిక కూడ పార్టిసిపెట్ చేసింది. ఒక్కసారిగా హ‌న్సిక‌ను చూసిన అంద‌రూ షాక్ అయ్యారు. ఎందుకంటే వీరిద్దరూ గ‌త నాలుగు నెల‌ల నుండి ఎటవంటి ఫోన్ ట‌చ్‌లో లేరు. ష‌డ‌న్‌గా బ‌ర్త్‌డే పార్టీలో క‌నిపించేస‌రికి వీరిద్దరి మ‌ధ్య ఎఫైర్ ప‌చ్చగానే ఉంద‌ని అంద‌రూ అనుకున్నారు. నిజానికి ఈ పార్టీలో న య‌న‌తార క‌నిపించాల్సింది, న‌య‌న‌తార మాత్రం శింభు పుట్టిన‌రోజు వేడుక‌ల‌కే హాజ‌రు కాలేదు. అలాగే పుట్టిన‌రోజు వేడుక‌లు 3వ తేధీ ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కూ జ‌రిగాయి. అర్ధారాత్రి కేక్ క‌టింగ్ అనంత‌రం శింభును హ‌న్సిక చాటుగా లిప్‌కిస్ ఇచ్చింద‌ని ఆ పార్టీలో పాల్గొన్న స్నేహితుల వ‌ద్ద నుండి స‌మ‌చారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అంతే కాకుండా ఆ సీన్‌ను కూడ ఎవ‌రో సీక్రెట్‌గా ఫొటో తీసి బ‌య‌ట‌కు ప‌బ్లిష్ చేశారు. దీంతో ఈ టాపిక్ ఎట్‌ప్రెజెంట్ హాట్‌టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: