హాట్ లుక్స్ తో ఉండే బ్రిటీష్ మోడల్ డాన్సర్ స్కార్లెట్ చాలామంది యువతరానికి పరిచియం ఉన్న పేరే. ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిపి జ్వరం వచ్చింది అంటూ యూత్ గుండెలలో జ్వరాన్ని పుట్టించిన బ్రిటీష్ డాన్సర్ స్కార్లెట్ ఈసారి టాలీవుడ్, కోలీవుడ్ లకు సంక్రాంతి సినిమాల ఐటమ్ గర్ల్ గా మారి టాలీవుడ్, కోలీవుడ్ లను షేక్ చేసింది.  సంక్రాంతి రేసులో విజేతగా నిలిచినా ‘ఎవడు’ సినిమాలో చరణ్ తో అయ్యోపాపమంటూ, అదే విధంగా కోలీవుడ్ లో సంక్రాంతికి విడుదల అయిన హీరో విజయ్ ‘జిల్లా’ సినిమాలో జింగునమణి అంటూ ఈ హాట్ బ్యూటీ చేసిన డాన్స్ లకు మాస్ ప్రేక్షకులు కాసులు కురిపించడంతో మళ్ళీ వెలుగులోకి వచ్చింది ఈ బ్రిటీష్ భామ  ఈమె ఈ సందర్భంగా మీడియాతో తన ఆనందాన్ని షేర్ చేసుకుంటూ తాను ఎంత మంది హీరోలతో డాన్స్ చేసినా పవన్ కళ్యాణ్ తో చేసిన డాన్స్ ల మజా తనకు ఏ హీరో తోను రాలేదు అని అనడమే కాకుండా తన విజియాన్ని పవన్ కు అంకితం ఇస్తోంది ఈ బ్రిటీష్ హాట్ బ్యూటీ. పవన్ లుక్స్ లో మాయ అంటే అదే కాబోలు.  

మరింత సమాచారం తెలుసుకోండి: