రాను రాను సినిమాలు దాదాపు అడల్ట్ మూవీస్ లాగానే తయారవుతున్నాయి ఫ్యామిలీ మొత్తం వెళ్లి సినిమా చూసే సినిమా చాలా తక్కువనే చెప్పాలి. సినిమా ఆడాలంటే యూత్ ని ఎక్కువగా ఎక్ట్రాక్ట్ చేయాలని దర్శనిర్మాతలు ఎక్కువగా హీరోయిన్ తో రొమాంటిక్ సీన్స్.. ఎక్స్పోజింగ్ లు.. సందర్భం ఉన్నా లేకున్నా చేయించేస్తున్నారు. హీరోయిన్లు కూడా తమకి పోటీగా రోజుకు చాలా మంది ఇండస్ట్రీలో దిగుతున్నారు వారి పోటిలో నెగ్గాలంటే కొంచం సిగ్గు విడవక తప్పదు అన్నట్లుగా డైరక్టర్ ఏది చెబితే అది చేసేస్తున్నారు. సినిమాలకు ఎంట్రీ ఇచ్చిన మొదట రెండు మూడు సినిమాలు కొంచం ఒంటినిండా డ్రెస్ ధరించే హీరోయిన్ కాస్తా.. సినిమా సినిమాకి తన డ్రెస్ కొలతలను కూడా తగ్గించుకుంటువస్తుంది. ఇలా ఎందుకు అంటే ఆడియెన్స్ వాంట్స్ మోర్ దాన్ ఫ్రమ్ హీరోయిన్స్ అని డైరక్టర్లు వారిని వారు సమర్ధించుకుంటున్నారు. తెలుగు సినిమాల పరిస్థితి కొద్దిగా పర్వాలేదు కాని బాలీవుడ్ సినిమాలు మాత్రం చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయి. సినిమా వస్తుందంటే సినిమాలో ఇన్ని ముద్దు సీన్లున్నాయ్.. ఈ హీరోయిన్ ఐటం సాంగ్ ఉంది అని ఆడియెన్స్ ని ఊరిస్తుంటారు. వారు చూపిస్తే లేదు గాని మనం చూస్తే వచ్చిందా అంటూ వచ్చిన సినిమానల్లా చూసేస్తున్నారు మన ప్రేక్షకులు. ఎంతైనా సినిమా పిచ్చోళ్లు కదా అందుకే.. ఇంతకీ సినిమా తీసేది దర్శకుడి ప్రతిభను చూపించడానికా లేక ఇంకేదైనా అని డౌట్ పడుతున్నారు కొంతమంది నిజంగా సినిమాని అభిమానించే ఆడియెన్స్.. ఏది ఏమైనా దర్శక నిర్మాతలు హీరోయిన్ బాడి షేప్ మీద కాన్సెంట్రేట్ తగ్గించి మంచి సినిమాని ఆడియెన్స్ కి ఇద్దాం అనే ఆలోచనని పెంచుకుంటే మంచిదని అభిప్రాయపడుతుంది ఎపిహెరాల్డ్.కామ్. ఈ ఆర్టికల్ పై మీ స్పందన..?

మరింత సమాచారం తెలుసుకోండి: