ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ప్రణిత. ఆ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందక పోయినా అమ్మడికి లవర్ బోయ్ సిద్దు సరసన బావ సినిమాలో నటించినే అవకాశం వచ్చింది . ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యే సరికి అమ్మడు కొంత కాలం టాలీవుడ్ కి గ్యాప్ ఇచ్చి కోలీవుడ్ లో సినిమాలు చేసింది. అక్కడ సినిమాలు హిట్ అవ్వడంతో అదే జోష్ తో మరళ ఇక్కడ అత్తారింటికి దారేదిలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా రికార్డ్ కలెక్షన్స్ తో సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అమ్మడికి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది టాలీవుడ్ లో.. రీసెంట్ గా మంచు ఫ్యామిలీ అంతా కలిసి సందడి చేసిన పాండవుల సినిమాలో నటించి తన ఖాతాలో మరో హిట్ సినిమా వేసుకుంది. చూస్తుంటే ప్రణితకు మంచి రోజులొచ్చాయనే చెప్పాలి. చిన్న సినిమా దర్శకనిర్మాతలు కూడా హీరోయిన్ గా ఈమెను సంప్రదిస్తున్నారట. మొదట కెరియర్ పరంగా కొద్దిగా ఆటు పోట్లు ఎదుర్కున్న ప్రణిత ప్రస్తుతం ఎన్.టి.ఆర్ రభస సినిమాలో ఒక హీరోయిన్ గా చేస్తుంది. ఈ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి జోష్ మీద ఉన్న ప్రణిత మంచి సూపర్ హిట్ సినిమాలు చేసి ఇంకా మరిన్ని ఆఫర్లు తన ఖాతాలో వేసుకోవాలని కోరుకుంటుంది ఎపిహెరాల్డ్.కామ్. ఇప్పటికైనా ప్రణీత కెరియర్ సెట్ అయినట్లేనా..?

మరింత సమాచారం తెలుసుకోండి: