నందమూరి సింహం బాలకృష్ణకు ఈ సంవత్సరం చాల ముఖ్యం సినిమాల పరంగా, రాజకీయ పరంగా ఈ సంవత్సరం బాలకృష్ణ తన అభిమానుల అంచనాలను అందుకోలేకపోతే అటు సినిమా కెరియర్ పరంగా ఇటు రాజకీయాల పరంగా బాలయ్య చాల తీవ్రంగా నష్టపోతాడు. ఇటువంటి పరిస్థుతులలో బాలయ్యకు ఒక భారీ హిట్ అవసరం. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బాలకృష్ణ తాను నటిస్తున్న ‘లెజెండ్’ సినిమా పై చాల విపరీతమైన అంచనాలు పెట్టుకున్నాడు. ఈ నేపధ్యంలో ఈ సినిమా పై బాలయ్య అభిమానుల అంచనాలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఈ భారీ సినిమా షూటింగ్ దుబాయి లో షూటింగ్ జరుపుకుంటోoది. ఈ చిత్రం వెనక ఓ రహస్యమైన ఎజెండా ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో,పొలిటికల్ సర్కిల్స్ లో తెగ గుసగుసలు వినపడుతున్నాయి. ఈ చిత్రం అసలు ఉద్దేశ్యం ఎలక్షన్ సమయంలో తెలుగు దేశం కేడర్ ను ఉత్తేజపరచడమే అని చెప్పుతున్నారు. అలాగే ఈ చిత్రంలో బాలకృష్ణ చేత చెప్పించే డైలాగులు పార్టీ ప్రచారానికి ఉపయోగపడేలా ప్లాన్ చేసారని టాక్. ఎట్టి పరిస్తుతులలోను ఈసారి బాలకృష్ణ ఎలక్షన్స్ లో పోటీ చేస్తాడు కాబట్టి అందుకే ఈ 'లెజండ్' అవతారం అంటున్నారు. ఇందులో మాస్ లీడర్ గా ఆయన కనపడటం వెనక ఉద్దేశ్యం అదేనని నందమూరి అభిమానుల వాదన. పూర్తి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సామాజిక అంశాలకు పెద్ద పీట ఉంటుందని టాలీవుడ్ టాక్. దర్శకుడు బోయపాటి కూడా ఈ చిత్రాన్ని బాలయ్య రాజకీయ భవిష్యత్‌కు ఉపకరించేలా రూపొందిస్తున్నాడట. బాలయ్య అభిమానులను, తెలుగు దేశం పార్టీలను అలరించేలా సినిమాలో డైలాగులు ఉంటాయని బాలయ్య అభిమానులు ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మరోసారి చక్రం తిప్పాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు బాలయ్య ‘లెజెండ్’ ఎంత ఉపయోగ పడుతుందో చూడాలి. ఈ సినిమా జయాపజయాలు బాలయ్య కెరియర్ పైనే కాదు తెలుగుదేశం పార్టీ భవితవ్యాన్ని కూడా నిర్ణ ఇస్తుందని విశ్లేషకులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: