పవన్ బ్లాక్ బస్టర్ హిట్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో ఓ సన్నివేశంలో బ్రహ్మానందం విలన్ల ఇంటికి వెళ్లడం నా వెనక ‘గబ్బర్ సింగ్' ఉన్నాడంటూ పవన్ కళ్యాణ్ కటౌట్ రిక్షాపై పెట్టుకుని రావడం విలన్లకు ఝలక్ ఇవ్వడం మనందరికీ తెలిసిందే. లేటెస్ట్ గా కమెడియన్ ఆలీ కూడా ఇదే సూత్రాన్ని అవలంభించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు.  ‘అలీ బాబా ఒక్కడే దొంగ' ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ పవన్ లేకుండా పవన్ కటౌట్ తో జరిగిపోయింది. ఈ ఫంక్షన్ లో అలీ పవన్ కళ్యాణ్‌తో దిగిన ఫోటోలే మెయిన్ అట్రాక్షన్ గా అయ్యాయి. మరొక ట్విస్ట్ ఏమిటంటే ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ సందర్భంగా ప్రధానం చేసిన షీల్డులపై కూడా పవన్ కళ్యాణ్‌తో కలిసి అలీ దిగిన ఫోటోలనే ప్రధానంగా ముద్రించడం పవన్ రాక పోయినా ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను వీయోడ్ బైట్ ద్వారా ప్రదర్శించడం చూస్తూ ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ లో పవన్ కళ్యాన్‌ మ్యానియా ఏ రేంజ్ లో ఉందో తెలుస్తోందని విశ్లేషకులు అంటున్నారు  ఒకప్పుడు అలీ హీరోగా వరుస కామెడీ చిత్రాలు వచ్చాయి. అయితే అలీ గత కొంత కాలంగా హీరో పాత్రలకు దూరంగా ఉంటున్న ఆలీ ఈ సినిమా ద్వారా మళ్ళీ హీరోగా ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేసిన ఆడియో హిట్టయిన నేపథ్యంలో ఈ ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ ఏర్పాటు చేసారు నిర్మాతలు.    

మరింత సమాచారం తెలుసుకోండి: