పవన్ కల్యాణ్ కి చెందిన డైలాగ్, లేదా పాట, అదీ కాకుంటే టైటిల్ ఇవి కూడా కుదరకపోతే కనీసం కటౌట్ వాడుకుంటూ ఎదో విధంగా ప్రస్తుతం ఉన్న పోటీ వాతావరణంలో తమ కెరియర్ ను మలుచు కుందామని ఎందరో హీరోలు వారివారి శక్తిని బట్టి పవన్ నామ స్మరణ చేస్తూ రోజులు గడిపేస్తున్నారు. ఇప్పుడీ లిస్టులో హీరో నానీ కూడా చేరిపోయాడు. నాని నటించి ఈ నెలలో విడుదల కాబోతున్న బాలీవుడ్ సినిమా 'బ్యాండ్ బాజా బారాత్'కు అధికారిక రీమేక్ అయిన 'ఆహా కల్యాణం'లో చెప్పే డైలాగులలో మొదట 'నాకు కొంచెం తిక్క ఉంది, దానికో లెక్క ఉంది, ..' అని వస్తుందట అంతటి తో ఆగ కుండా ఆ తర్వాత లైన్ లో 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాథ్ ' అనే డైలాగు కూడా ఉందట. బాగా పాపులర్ అయిన ఈ రెండు డైలాగులు పవన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటాయని నాని భావిస్తున్నాడట. 'బ్యాండ్ బాజా బారాత్' నిర్మించిన ప్రతిష్ఠాత్మక బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న తొలి దక్షిణాది సినిమా ఇది. గోకుల్‌కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వాణీ కపూర్ హీరో నానికి ఇచ్చిన ముద్దు సన్నివేసం ఈ సినిమాకు గుండెకాయ అని అంటున్నారు. ఈ చిత్రం మరో రెండు వారాల్లో విడుదల కానుంది. ఈ రీమేక్ లో నటించడానికి యష్ రాజ్ ఫిల్మ్స్ రూ. 2.5 కోట్లు ఆఫర్ చేసిందనే వార్త ఆ మధ్యన టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి కొద్ది సేపట్లో నాని ‘పైసా’ భవిష్యత్ తెలియబోతున్న తరుణంలో పవన్ నామ స్మరణ ఈ నెలలో నానీకి ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: