ఒకదాని తర్వాత మరొకటి.. వరుసగా సినిమాలు సినిమాలు చేస్తున్నాడు ఓ యంగ్ హీరో… సక్సెస్, ఫ్లాప్లతో సంబంధం లేకుండా దూసుకెళ్తున్నాడు… ఇన్ని సినిమాలు చేస్తున్నా సక్సెస్ మంత్ర తెలుసుకోలేకపోతున్నాడీ హీరో.. అక్కినేని వారసుడిగా..నాగార్జున తనయుడిగా జోష్ తో తెరంగేట్రం చేసినా.. ఏ మాయ చేశావేతో మొదటి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు నాగచైతన్య. ఆ సినిమా సమంత తో చేసిన చైతు రొమాన్స్ యూత్ అందరు మంచి రొమాంటిక్ ఫీల్ పొందారు. ఆ తర్వాత సినిమాలు చేసినా హిట్ కోసం బాగానే సఫర్ అయ్యాడు చైతూ. సుకుమార్ డైరక్షన్లో 100 పర్సెంట్ లవ్ సినిమాతో రెండో హిట్ కొట్టాడు.. దాదాపు 8 సినిమాలు చేసిన ఈ హీరో మొన్న తడాకాతో కలుపుకుని 3 హిట్స్ మాత్రమే సాధిచాడు. దీంతో మిగతా హీరోలతో పోల్చితే కెరియర్ పరంగా కొద్దిగా వెనుక పడిపోయాడు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్న వరుసగా సినిమాలు చేస్తున్నాడు చైతన్య. ప్రస్తుతం ఆటోనగర్ సూర్య రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న నాగ చైతన్య లేటెస్ట్గా దుర్గ అనే కొత్త సినిమా కి క్లాప్ కొట్టాడు. ఢమరుకం శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సి.కళ్యాన్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నాగా చైతన్యతో పాటు హాన్సిక జోడీ కడుతోంది. సినిమాల పరంగా కౌంట్ బాగానే ఉన్నా ఈ హీరో హిట్ల లిస్ట్ లో మాత్రం లాస్ట్ లో ఉన్నాడనే చెప్పాలి. సో ఇకనైనా చైతు సినిమాల విషయంలో కొద్దిగా జాగ్రత్త పడితే మంచిదని కోరుకుంటుంది ఎపిహెరాల్డ్.కామ్. నాగ చెతన్య కెరియర్ పై మీ అభిప్రాయం ..?

మరింత సమాచారం తెలుసుకోండి: