టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్‌కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీ ప్రముఖుల మ‌ధ్య వినిపిస్తుంది. దానికి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ డిటైల్స్‌ను ఎపిహెరాల్డ్‌.కామ్ మీకు అందిస్తుంది. మొన్నటి వ‌ర‌కూ ప్రభాస్ పై ఎఫైర్ వార్తలు హ‌ల్‌చ‌ల్ చేశాయి. అదీనూ పొలిటిక‌ల్ లీడ‌ర్ కూతురితో ఆ ఎఫైర్ కొన‌సాగుతుంద‌ని తెగ టాక్స్ వినిపించాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేద‌ని, త‌ప్పుడు వార్తలు చెబితే ప‌ళ్ళురాల‌గొడ‌తాన‌ని త‌నదైన శైలిలో కృష్ణంరాజు గాసిప్ రాయుళ్ళుకి వార్నింగ్ ఇచ్చాడు. అయితే తాజాగా ప్రభాస్ ఎంగేజ్‌మెంట్ పూర్తి అయింద‌ని టాపిక్స్ వినిపిస్తున్నాయి. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ ఫ్యామిలికు, చాలా స‌న్నిహితంగా ఉండే బంధువుల ఫ్యామిలిలోని ఓ అమ్మాయితో ప్రభాస్‌కు ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ అయ్యింద‌ని అంటున్నారు. ఆ అమ్మాయితో గ‌త కొంత కాలంగా ప్రభాస్ చాలా ద‌గ్గరి ఎఫైర్ కొన‌సాగిస్తున్నాడ‌ని, చివ‌రిగా వాళ్ళిద్దరికి రీసెంట్‌గానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిన‌ట్టు టాలీవుడ్ నుండి అందిన స‌మాచారం. భీమ‌వ‌రంలో జ‌రిగిన ఈ ఎంగేజ్‌మెంట్ అత్యంత నిరాడంబ‌రంగా జ‌రిగిన‌ట్టు టాలీవుడ్ నుండి అందిన స‌మాచారం. త్వర‌లోనే ప్రభాస్ పెళ్లికు సంబంధించిన డేట్‌ను అఫిషియ‌ల్ అనౌన్స్‌మెంట్ ద్వార తెలియ‌జేస్తార‌ని అంటున్నారు. అయితే ఈ వార్తల‌పై ప్రభాష్ త‌రుపు నుండి ఇంకా ఎటువంటి క్లారిటి రాలేదు. ఏదేమైన ప్రభాస్ ఈ వార్తల‌పై ఏ విధంగా స్పంధిస్తాడో వేచిచూడాలి మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: