టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా మారి, అటు కోలీవుడ్‌, బాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీల‌లో సైతం శృతిహాస‌న్ స్టార్‌డం దిశ‌గా దూసుకుపోతుంది. అయితే శృతిహాన‌న్ మ‌రికొద్ది రోజుల్లో రాబోతున్న ప్రేమికుల రోజు సంద‌ర్భంగా త‌న షెడ్యూల్‌ను వివ‌రించింది. త‌ను చెప్పిన షెడ్యూల్‌ను విన్న బిటౌన్ అవాక్కయింది. శృతికి ఏమైంది అంటూ బిటౌన్‌లో హాట్ టాపిక్స్ వినిపిస్తున్నాయి. శృతిహాస‌న్ ఆ రోజు చేయ‌బోతున్న హాట్ న్యూస్‌ను ఎపిహెరాల్డ్‌.కామ్ ఎక్ష్‌క్లూజివ్‌గా మీకు అందిస్తుంది. ఫిబ్రవ‌రి 14న శృతిహాస‌న్ త‌న డే షెడ్యూల్‌న్‌ను ప్రిపేర్ చేసుకుంది. వాలెంటైన్ డే సంద‌ర్భంగా రెండు రోజుల పాటు షూటింగ్‌కు సెల‌విచ్చింది. 13,14 రోజున ఎటువంటి షూటింగ్స్‌కు వెళ్ళడంలేదు. ముంబాయ్‌లోని బాంద్రా ఏరియాలోనే త‌ను ప్రేమికుల రోజు వేడుకుల‌ను ఘ‌నంగా నిర్వహిస్తుంది. త‌న చిన్ననాటి స్నేహితుల‌ను ఆ రోజు ఇంటికి పిలుస్తుంది శృతిహాస‌న్‌. ముఖ్యంగా అందులో శృతిహాస‌న్‌ను ప్రపోజ్ చేసిన వారే ఉండాలంట‌. ఆ విధంగా ఇప్పటికే పేర్లను రెడీ వారికి మేట‌ర్ కూడ చెప్పేసింది. 13 రాత్రిన, ఆ స్నేహితుల‌తో ఎంచ‌క్కా ఎంజాయ్ చేస్తుంద‌ట‌. ఈ ఎంట‌ర్‌టైన్మెంట్‌లో బిటౌన్ హీరోలు సైతం పార్టిసిపెట్ చేయ‌నున్నారు. ఇందులోనూ శృతిహాస‌న్‌కు ద‌గ్గర‌గా ఉన్న హీరోలే, ఆ పార్టికి వ‌స్తున్నారు. మొత్తంగా శృతిహాస‌న్ వాలెంటైన్ డే న త‌న‌ను ప్రపోజ్ చేసిన బాయ్‌ప్రెండ్‌తో ఎంజాయ్ చేయ‌బోతుంద‌ని బిటౌన్‌లో ఇప్పటికే హాట్ టాపిక్స్ వినిపిస్తున్నాయి. ఈమెకు ఇదేమి హాబిట్ అంటూ అంద‌రూ గుస‌గుస‌లాడుతున్నారంట.

మరింత సమాచారం తెలుసుకోండి: