పవన్ నెమ్మదినెమ్మదిగా సినిమా ఫంక్షన్స్ కే కాకుండా పబ్లిక్ కు కూడ హాజరు అయ్యే అలవాటును నెమ్మదినెమ్మదిగా పెంచు కుంటున్నాడ అని అనిపిస్తోంది. ఆమధ్య అంతర్జాతీయ చిల్డ్రన్స్ ఫెస్టివల్ ఆ తరువాత కస్టమ్స్ ఆఫీసర్స్ మీట్ ఇలా ప్రభుత్వ కార్యక్రమాలలో కూడ చురుకుగా పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ అతి త్వరలో ఒక సామాజిక సంస్థ తల పెట్టిన ‘వాక్ ఫర్ హార్ట్ రీచ్ ఫర్ ఎ హార్ట్' కార్యక్రమంలో జనంతో కలిసి నడవబోతున్నాడు అనే వార్త సంచలనంగా మారింది.  ఫ్యామిలీ ఈవెంట్స్, ఆడియో పంక్షన్స్ వంటి వాటిలో మాత్రమే అరుదుగా కనిపించే పవన్ కళ్యాణ్ ఓ మంచి కారణం కోసం ఇలా పబ్లిక్ లో కనిపించబోతున్నాడు. ప్రజాహిత సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో నూతనంగా నెలకొల్పబడిన ‘హృదయ స్పందన ఫౌండేషన్' వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగ్యనగర వీధులలో జనంతో కలిసి నడుస్తాడట పవన్ కళ్యాణ్.  ఈ ఈవెంట్ మార్చి 2న సాయంత్రం 6 గంటలకి హైదరాబాద్ లోని పివి నరసింహారావు ఘాట్ నుండి ప్రారంభం కాబోతోంది అని తెలుస్తోంది. తెలుగువారి నుండి వచ్చిన ఏకైక ప్రధానిగా రికార్డు నెలకొల్పిన పివి నరసింహారావు ఘాట్ నుండి ఈ రన్ కార్యక్రమం నిర్వహింపబడటం. అదేవిధంగా ఎప్పటి నుంచో రాజకీయ ఎంట్రీకి సంబంధించిన వార్తల మధ్య నలుగుతున్న పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి అతిధిగా హాజరు కావడం కేవలం సాజిక స్పృహ మాత్రమేనా లేకుంటే ఇందులో మరేదైనా రాజకీయ ఉద్దేశ్యాలు ఉన్నాయా అన్న విషయం రానున్న రోజులలో తెలుస్తుంది.  ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాసులు ముఖ్య అతిధులుగా హాజరు అవుతూ ఉండటంతో ఇక ఆ రోజు నెక్లెస్ రోడ్ అంతా పవన్ అభిమానుల కోలాహలంతో కిటకిటలాడే అవకాసాలు ఉన్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: