టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో శేఖ‌ర్ క‌మ్ములది డిప్రెంట్ స్టైల్‌. త‌ను ఎంత‌ స‌హజంగా మూవీను తీస్తాడో, బ‌య‌ట కూడ అంతే నిజాయితీగా ఉంటాడు. ఇదిలా ఉంటే శేఖ‌ర్ క‌మ్ముల తీసిన అనామిక మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ మూవీను ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో అనాటి నుండి నేటి వ‌ర‌కూ శేఖ‌ర్ క‌మ్ముల ప్రతిభ‌ను టాలీవుడ్‌లోని ఓ వ‌ర్గం కించ‌ప‌రుస్తూనే వ‌స్తుంది. ఓ రిమేక్ ఫిల్మ్‌ను తీయ‌టానికి ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నాడు? ఫ్రేమ్‌ టు ఫ్రేమ్ కాపి కొట్టడానికి ఇంత స‌మయం ఎందుకు? వ‌ంటి ప్రశ్నలు శేఖ‌ర్‌ను టార్గెట్ చేసి అంటున్నారు. ఈ న్యూస్‌ను ఎపిహెరాల్డ్‌.కామ్ ఎక్స్‌క్లూజివ్‌గా అందిస్తుంది. వెల్‌, మేట‌ర్‌లోకి వెళితే శేఖ‌ర్ క‌మ్ముల‌పై వినిపిస్తున్న ఈ కామెంట్స్‌కి ఈసారి ఓ ప్రెస్‌మీట్ ద్వార శేఖ‌ర్ గ‌ట్టిగానే స‌మాధానం ఇచ్చాడు. 'నేను తీస్తున్న అనామిక ఫిల్మ్ రిమేక్ అయినా, ఆ మూవీకు, ఈ మూవీకు చాలా తేడా ఉంటుంది. క‌హాని మూవీలో ప్రెగ్నెంట్ అయిన ఉమెన్‌, మిస్పింగ్ అయిన త‌న భ‌ర్తను వెతుకుతుంది. ఇందులో అలా జ‌ర‌గ‌దు. న‌య‌న‌తార‌కు ప్రెగ్నెంట్ అనే టాపిక్ అనామిక మూవీలో లేదు' అని క్లారిటి ఇచ్చాడు. అలాగే మ‌రో విష‌యం గురించి కూడ క్లారిటి ఇచ్చాడు. 'నేను ఫ్రేమ్ టు ఫ్రేమ్ మూవీను రిమేక్ చేయ‌లేదు. తెలుగు నేటివిటికి త‌గ్గట్టుగా మూవీను చిత్రీక‌రించాను. ఫ్రేమ్ టు ఫ్రేమ్ కాపీ కొడితే ఈ మూవీను నేను రిమేక్ చేయాల్సిన అవ‌స‌రం లేదు అంటూ కామెంట్ చేసే వాళ్ళకి స్ట్రాంగ్ డోస్ ఇచ్చాడు. శేఖ‌ర్ క‌మ్ముల అనామిక మూవీ గురించి ఇంత వివరంగా చెప్పటం ఇదే మొద‌టి సారి. అలాగే త‌నపై వ‌స్తున్న గాసిప్స్‌కి సైతం ఈ విధ‌మైన కౌంట‌ర్ ఇవ్వ‌టం కూడ ఇదే మొద‌టి సారి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: