దాదాపు అయిదు వ‌రుస ప్లాపుల త‌రువాత ర‌వితేజా చేసిన మూవీ బ‌లుపు. బ‌లుపు మూవీతో స‌క్సెస్‌ను అందుకున్న ర‌వితేజ ఇక నుండి త‌న ఫిల్మ్ కెరీర్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ర‌వితేజ ఫిల్మ్ కెరీర్ ఫ్లానింగ్స్‌ను చూస్తుంటే ఇండ‌స్ట్రీలోని పెద్దలు సైతం అవాక్కవుతున్నారంట‌. ర‌వితేజ ప‌ని అయిపోయింది అనుకున్న వాళ్ళు, ఇప్పుడు ర‌వితేజ మ‌ళ్ళీ ఫాంలోకి వ‌చ్చాడు అని అంటున్నారు. టాలీవుడ్‌లో వివిపిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్‌ను ఎపిహెరాల్డ్‌.కామ్ మీకు అందిస్తుంది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ర‌వితేజా స్టైల్ రూటే స‌ప‌రేటు అంటారు. ప్రస్తుతం ర‌వితే కేవ‌లం ఒకే ఒక్క మూవీలో న‌టిస్తున్నాడు. బాబి ద‌ర్శక‌త్వంలో వ‌స్తున్న ప‌వ‌ర్ మూవీతో ర‌వితేజ బిజిగా ఉన్నాడు. ఒక‌ప్పుడు త‌న చేతి లోనాలుగు మూవీల వ‌ర‌కూ ప్రిషెడ్యూల్ జ‌రిగి ఉంటుంది. ఇప్పుడు త‌న ముందుకు ఎంత మంది ఎన్ని స్టోరీల‌ను తీసుకువ‌చ్చినా, ఈ మూవీ త‌రువాత చూద్దాం అంటూ ప‌క్కన పెట్టేస్తున్నాడంట‌. ర‌వితేజలోని మార్పును చూసిన స్టోరి రైట‌ర్లు, న‌యా డైరెక్టర్లు విస్తుత‌పోతున్నారు. అయితే రీసెంట్‌గా ర‌వితేజా మ‌రో మూవీకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. 2009లో త‌న‌కు బ్లాక్‌బ‌స్టర్ స‌క్సెస్‌ను అందించిన కిక్ మూవీ సీక్వెల్‌ను త్వర‌లోనే స్టార్ట్ చేయ‌బోతున్నాడు. కిక్ సీక్వెల్ జూన్ నెల నుండి సెట్స్ మీద‌కు వెళుతుంద‌ని ప్రి ప్రొడ‌క్షన్ నుండి అందిన స‌మాచారం. ప్రస్తుతం సురేంద‌ర్ రెడ్డి రేసుగుర్రం మూవీ షూటింగ్‌లో బిజిగా ఉన్నాడు. ఈ మూవీ త‌రువాత ర‌వితేజ‌తో కిక్-2ను సెట్స్ మీద‌కు తీసుకుపోవ‌టానికి సిద్ధంగా ఉన్నాడు.దీంతో ఇక నుండి ర‌వితేజాకు అన్ని శుభ‌గ‌డియ‌లే అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: